కోర్టు ఆదేశాల ధిక్కారణ కేసులో ఆరుగురికి జైలు శిక్ష
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరులో ఓ ప్రజాప్రతినిధికి, ఐదుగురు అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. చెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా మండలి భవనం నిర్మాణానికి సంబంధించి గతంలో హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఈ స్టేను పట్టించుకోకుండా అక్కడ భవన నిర్మాణం చేపట్టడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి భవన నిర్మాణం చేపడుతున్నందుకు ఓ సర్పంచ్‌తోసహా డీపీఓ, డీఈఓ, హెడ్ మాస్టర్, ఇద్దరు ఏఈలకు జైలు శిక్ష విధించింది. సర్పంచ్‌కు మూడు […]
BY sarvi17 July 2015 4:10 AM GMT
X
sarvi Updated On: 17 July 2015 4:14 AM GMT
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరులో ఓ ప్రజాప్రతినిధికి, ఐదుగురు అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. చెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా మండలి భవనం నిర్మాణానికి సంబంధించి గతంలో హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఈ స్టేను పట్టించుకోకుండా అక్కడ భవన నిర్మాణం చేపట్టడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి భవన నిర్మాణం చేపడుతున్నందుకు ఓ సర్పంచ్‌తోసహా డీపీఓ, డీఈఓ, హెడ్ మాస్టర్, ఇద్దరు ఏఈలకు జైలు శిక్ష విధించింది. సర్పంచ్‌కు మూడు నెలలపాటు, మిగిలిన వారికి ఒక నెలపాటు జైలు శిక్షలు అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు కొంత వ్యవధి ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయగా హైకోర్టు శిక్షలను నాలుగు వారాలపాటు నిలుపుదల చేసింది.
Next Story