ప్రియాంక కు మడత కాజా పడినట్లే..!
బాలీవుడ్ లో గ్లామర్ తో పాటు యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా ఒకరు. బర్ఫీ చిత్రం తో నటిగా తన ప్రతిభను ఘనంగా చాటుకుంది. కట్ చేస్తే ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న బాజీరావు మస్తానీ చిత్రంలో ఆయన భార్య రోల్ పోషిస్తుంది. ఈ సినిమా 18 వ శతాబ్ధానికి చెందిన మరాఠ యోథుడు పీష్వా బాజీరావు ప్రేమ కథ. ఆయన మస్తానీ అనే యోధురాలుని ప్రేమిస్తాడు. అయితే ఇందులో […]
బాలీవుడ్ లో గ్లామర్ తో పాటు యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా ఒకరు. బర్ఫీ చిత్రం తో నటిగా తన ప్రతిభను ఘనంగా చాటుకుంది. కట్ చేస్తే ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న బాజీరావు మస్తానీ చిత్రంలో ఆయన భార్య రోల్ పోషిస్తుంది. ఈ సినిమా 18 వ శతాబ్ధానికి చెందిన మరాఠ యోథుడు పీష్వా బాజీరావు ప్రేమ కథ. ఆయన మస్తానీ అనే యోధురాలుని ప్రేమిస్తాడు. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. కథ పరంగా బాజీరావు రోల్ ను రణ్వీర్ సింగ్ పోషిస్తుండగా.. ఆయన భార్య గా ప్రియాంక చోప్ర నటిస్తుంది. అయితే ప్రియురాలి రోల్ మాత్రం దీపిక పదుకోణ్ కే ఇచ్చారు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.
ఎందుకంటే.. రియల్ లైఫ్ లో రణ్వీర్ సింగ్ , దీపక పదుకోణ్ లు లవర్స్ కావడంతో.. ఆన్ స్క్రీన్ మీద వీరి మధ్య కెమిస్ట్రీ బాగా పండుతుందిని ఇతని నమ్మకం. ఆయన నమ్మకం రామ్ లీలా చిత్రంలో నిజమయ్యింది. సో లవర్ రోల్ లో వుండే గ్లామర్.. వైఫ్ రోల్ లో వుండక పోవచ్చు కాబట్టి.. ఈ విధంగా చూస్తే.. ప్రియాంక చోప్రా బుక్ అయినట్లే అంటున్నారు పరిశీలకులు. ఏమో ఒక వేళ కథ పరంగా ప్రియాంక రోల్ కు కూడా బాగా ఇంపార్టెన్స్ వుందేమో.. లేక పోతే తను ఎందుకు అంగీకరిస్తుంది.!