మార్కెట్‌లో లీటర్ రూ. 34కే నందిని పాలు
వినియోగదారులను దోపిడీ చేస్తున్న పాల ఉత్పత్తి సంఘాలకు ధీటుగా మార్కెట్‌లోకి నందిని పాలు ప్రవేశించాయి. వీటి ధర లీటరుకు రూ. 34. మదర్ డెయిరీ, హెరిటేజ్ వంటి సంస్థలన్నీ మొన్నటి వరకు లీటరుకు 42 రూపాయలు వసూలు చేశాయి. అముల్ పాలు మార్కెట్‌లో 38 రూపాయలకే లభిస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో ఆయా సంస్థలు ఇపుడు లీటరు రూ. 40 రూపాయలకు తగ్గించారు. అయితే గురువారం నందిని పాలను లీటరుకు రూ. 34కే విక్రయించేలా మార్కెట్లోకి విడుదల చేయడంతో […]
BY sarvi16 July 2015 1:12 PM GMT
sarvi Updated On: 17 July 2015 1:27 AM GMT
వినియోగదారులను దోపిడీ చేస్తున్న పాల ఉత్పత్తి సంఘాలకు ధీటుగా మార్కెట్‌లోకి నందిని పాలు ప్రవేశించాయి. వీటి ధర లీటరుకు రూ. 34. మదర్ డెయిరీ, హెరిటేజ్ వంటి సంస్థలన్నీ మొన్నటి వరకు లీటరుకు 42 రూపాయలు వసూలు చేశాయి. అముల్ పాలు మార్కెట్‌లో 38 రూపాయలకే లభిస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో ఆయా సంస్థలు ఇపుడు లీటరు రూ. 40 రూపాయలకు తగ్గించారు. అయితే గురువారం నందిని పాలను లీటరుకు రూ. 34కే విక్రయించేలా మార్కెట్లోకి విడుదల చేయడంతో మళ్ళీ ఈ సంస్థలు ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాలి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) నందినీ స్పెషల్ హోమోజినైజ్డ్ టోన్డ్ మిల్క్ పేరుతో కొత్త టోన్డు పాలను లీటరుకు రూ. 34గా నిర్ణయించింది. ఈ పాలను స్పీకరు మధుసూదనాచారి మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కెఎంఎఫ్ చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ ఇక్కడ ఆర్జించిన లాభాల్లో కొంత భాగాన్ని స్థానిక రైతుల అభివృద్ధికే వినియోగిస్తామని హామీ ఇచ్చారు.
Next Story