క్యాన్సర్ కణాలను నాశనం చేసే మిర్చి!
పచ్చి మిర్చి అనగానే నషాళాన్నంటే కారమే మనకు గుర్తుకొస్తుంది. కానీ పచ్చిమిర్చి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లకీ, ప్రొటీన్లకీ పెట్టింది పేరు. మిర్చిలో విటమిన్ ‘ఎ’, ‘సి’లతో పాటూ రక్తహీనత రాకుండా చేసే ఇనుమూ, గుండె జబ్బులు రాకుండా చేసే పొటాషియం, క్యాన్సర్ కారకాలతో పోరాడే బీటా కెరొటిన్ వంటి పోషకాలున్నాయి. పచ్చి మిరపలో ఉండే పోషకాలు అజీర్తి సమస్య ఏర్పడకుండా కాపాడతాయి. పచ్చిమిర్చిలో ఉండే “కాప్సాసిన్” కీళ్ళ నొప్పులు, తలనొప్పి తగ్గిస్తుంది. కాన్సర్ కణాలను నాశనం చేస్తుంది . […]
BY sarvi17 July 2015 1:31 AM IST
X
sarvi Updated On: 15 July 2015 12:18 PM IST
పచ్చి మిర్చి అనగానే నషాళాన్నంటే కారమే మనకు గుర్తుకొస్తుంది. కానీ పచ్చిమిర్చి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లకీ, ప్రొటీన్లకీ పెట్టింది పేరు. మిర్చిలో విటమిన్ ‘ఎ’, ‘సి’లతో పాటూ రక్తహీనత రాకుండా చేసే ఇనుమూ, గుండె జబ్బులు రాకుండా చేసే పొటాషియం, క్యాన్సర్ కారకాలతో పోరాడే బీటా కెరొటిన్ వంటి పోషకాలున్నాయి. పచ్చి మిరపలో ఉండే పోషకాలు అజీర్తి సమస్య ఏర్పడకుండా కాపాడతాయి. పచ్చిమిర్చిలో ఉండే “కాప్సాసిన్” కీళ్ళ నొప్పులు, తలనొప్పి తగ్గిస్తుంది. కాన్సర్ కణాలను నాశనం చేస్తుంది . స్థూల కాయం ఉన్నా వాళ్లు కి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది. పాంక్రియాస్‌ను యాక్టివేట్ చేస్తుంది. కెలొరీలని కరిగించి జీవ క్రియలు వేగంగా జరిగేట్టు చూస్తాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తగిన మోతాదులో పచ్చి మిరపకాయలు ఆహారంలో తీసుకుంటే ఉపశమనం పొందుతారు. వీటిల్లో పుష్కలంగా ఉండే ‘ఎ’ విటమిన్ మెరుగైన కంటిచూపుకు దోహదపడుతుంది. ఎముకలూ, దంతాల పరిపుష్టికి సాయపడుతుంది.
Next Story