Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 146

అద్దాలు “నాకు మూడు జతల అద్దాలు కావాలి.” “మూడెందుకు?” “ఒకటి దూరంగా ఉన్నవి చూడ్డానికి, రెండోది దగ్గరగా ఉన్నవి చూడ్డానికి.” “మరి మూడోది.” “ఆ రెండూ ఎక్కడ ఉన్నాయో చూడ్డానికి.” ——————————————————————— స్వప్న ఫలం భార్య: రాత్రి నాకు కలవచ్చింది. మీరు నాకు వజ్రాల నెక్లెస్‌ వేలెంటైన్స్‌ డేకి ప్రజెంట్‌ చేసినట్లు కలవచ్చింది. దీని అర్థమేమిటి? భర్త: దాని అర్థం నీకు రాత్రికి తెలుస్తుంది. అని సాయంత్రం బయటికి వెళ్లి ఒక గిఫ్ట్‌ప్యాక్‌ తీసుకొచ్చాడు. భార్య ఆనందంగా […]

అద్దాలు
“నాకు మూడు జతల అద్దాలు కావాలి.”
“మూడెందుకు?”
“ఒకటి దూరంగా ఉన్నవి చూడ్డానికి, రెండోది దగ్గరగా ఉన్నవి చూడ్డానికి.”
“మరి మూడోది.”
“ఆ రెండూ ఎక్కడ ఉన్నాయో చూడ్డానికి.”
———————————————————————
స్వప్న ఫలం
భార్య: రాత్రి నాకు కలవచ్చింది. మీరు నాకు వజ్రాల నెక్లెస్‌ వేలెంటైన్స్‌ డేకి ప్రజెంట్‌ చేసినట్లు కలవచ్చింది. దీని అర్థమేమిటి?
భర్త: దాని అర్థం నీకు రాత్రికి తెలుస్తుంది. అని సాయంత్రం బయటికి వెళ్లి ఒక గిఫ్ట్‌ప్యాక్‌ తీసుకొచ్చాడు.
భార్య ఆనందంగా ఆ ప్యాక్‌ విప్పి చూసింది.
అందులో ఒక పుస్తకముంది. దాని పేరు “ది మీనింగ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌”.
———————————————————————
టీచర్‌
టీచర్‌: ఒకతను చెబుతూ ఉంటాడు. వినే వాళ్లకి ఆసక్తి ఉండదు. అతన్నేమంటారు?
స్టూడెంట్స్‌: టీచర్‌!
———————————————————————
చూపు
టీచర్‌: మనిషి చూపు బలమైందా? పక్షులు బాగా చూడగలుగుతాయా?
వెంకట్‌: పక్షుల చూపే బలమైంది.
టీచర్‌: ఎందుకు
వెంకట్‌: పక్షులు కళ్ళద్దాలు పెట్టుకోవడం మీరు చూశారా?

First Published:  16 July 2015 6:33 PM IST
Next Story