పుష్కర మృతుల కేసు నుండి బాబును తప్పించే ప్రయత్నాలు..!
పుష్కర మృతులు అనుమానాస్పద మరణాలుగా నమోదు.. ? గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి వద్ద తొక్కిసలాట జరిగి 27 మంది మరణించిన ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ మరణాలను అనుమానాస్పద మరణాలుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగి అంతమంది మరణించిన విషయం కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే వాటిని అనుమానాస్పద మరణాలుగా పోలీసులు నమోదు చేయడం చూస్తుంటే చంద్రబాబును రక్షించే ప్రయత్నంగానే […]
BY Pragnadhar Reddy17 July 2015 3:24 AM IST
X
Pragnadhar Reddy Updated On: 17 July 2015 4:42 AM IST
పుష్కర మృతులు అనుమానాస్పద మరణాలుగా నమోదు.. ?
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి వద్ద తొక్కిసలాట జరిగి 27 మంది మరణించిన ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ మరణాలను అనుమానాస్పద మరణాలుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగి అంతమంది మరణించిన విషయం కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే వాటిని అనుమానాస్పద మరణాలుగా పోలీసులు నమోదు చేయడం చూస్తుంటే చంద్రబాబును రక్షించే ప్రయత్నంగానే కనిపిస్తున్నదని విమర్శకులంటున్నారు. ఈ మరణాలపై 374 సెక్షన్ కింద అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కింద జరిగిన మరణాలు అని కేసు నమోదు చేయాల్సి ఉంది. కానీ 174 సెక్షన్ అంటే… అనుమానాస్పద మరణాలు కింద కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎక్కడా అనుమానాస్పద మరణాలుగా పేర్కొనలేదు. వీఐపీ ఘాట్‌లో కాకుండా సాధారణ ఘాట్‌లో సీఎం చంద్రబాబు, మరికొందరు వీఐపీలు వచ్చి గంటన్నరకు పైగా స్నానం చేయడం వల్లనే జనసందోహం పెరిగిపోయింది. వారు వెళ్లిపోయాక ముహూర్తానికే స్నానం చేయాలన్న భావనతో జనం ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. దాని ఫలితంగానే మరణాలు సంభవించాయి. పోలీసులు కూడా జనాన్ని నియంత్రించలేకపోయారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొంటే అందుకు భిన్నంగా పోలీసులు కేసు ఎలా పెడతారు? రాష్ట్రప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ కేసు నుంచి తప్పించాలని డీజీపీ చూస్తున్నారని దీనిని బట్టి అర్ధమౌతున్నదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ విమర్శించింది. ఈ విషాదానికి స్వయంగా ముఖ్యమంత్రే బాధ్యుడు…. కానీ ఆయన మాత్రం దీనిపై న్యాయ విచారణకు ఆదేశించడం చూస్తే ఇందులో అధికారులను బలిపశువులను చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు.
Next Story