భర్తకోసం త్యాగం...
తమిళ దర్శకులు కొందరు సమాంతర చిత్రాలు చేయడంలో తమ మార్క్ చూపిస్తుంటారు. అమలాపాల్ హీరోయిన్ గా చేసిన ప్రేమఖైది చిత్రం చూస్తే.. లవ్ స్టోరిని ఇలా కూడా చేయోచ్చా అనిపించేలా చేశాడు. కట్ చేస్తే ఈ చిత్రంలో అమలాపాల్ డస్కీ బ్యూటీ యూత్ ఆడియన్స్ ను తెగ ఎట్రాక్ట్ చేసింది. ఆ తరువాత తెలుగులో నాగచైతన్య సరసన బెజవాడ.. ఇదదరమ్మాయిలతో.. రాంచరణ్ సరసన నాయక్ వంటి చిత్రాలు చేసి మెప్పించింది. ఇక తమిళ్ లో నాన్న చిత్రం […]
తమిళ దర్శకులు కొందరు సమాంతర చిత్రాలు చేయడంలో తమ మార్క్ చూపిస్తుంటారు. అమలాపాల్ హీరోయిన్ గా చేసిన ప్రేమఖైది చిత్రం చూస్తే.. లవ్ స్టోరిని ఇలా కూడా చేయోచ్చా అనిపించేలా చేశాడు. కట్ చేస్తే ఈ చిత్రంలో అమలాపాల్ డస్కీ బ్యూటీ యూత్ ఆడియన్స్ ను తెగ ఎట్రాక్ట్ చేసింది. ఆ తరువాత తెలుగులో నాగచైతన్య సరసన బెజవాడ.. ఇదదరమ్మాయిలతో.. రాంచరణ్ సరసన నాయక్ వంటి చిత్రాలు చేసి మెప్పించింది.
ఇక తమిళ్ లో నాన్న చిత్రం చేస్తున్న సమయంలో ఆ చిత్ర దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడింది. వాళ్లు మీడియాకు చెప్పే వరకు మా మధ్య ఏమి లేదని చెప్పుకొచ్చింది. అయితే చివరకు గత యేడాది పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం యాక్టింగ్ కు బాయ్ చెప్పిన అమలాపాల్ తన భర్త విజయ్ కు చేదోడు వాదోడు గా వుంటుందని తెలుస్తుంది. అతను దర్శకుడు కావడంతో.. ప్రొడక్షన్ సైడ్ కూడా తన భార్య సేవలు ఉపయోగించుకుంటన్నాడు. అంటే ఏమి లేదు.. మంచి కథలతో వచ్చిన ఔత్సాహిక దర్శకుల కు అవకాశాలు ఇస్తున్నారట. శ్రియ, ప్రకాషరాజ్ కాంబినేషన్ లో మలయాళ డైరెక్టర్ ప్రియ దర్శన్ ఒక చిత్రం చేస్తున్నారు.ఈ సినిమా విజయ్ నిర్మాణం చేస్తున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ పనులన్ని అమలాపాల్ చూసుకుంటుంది. గురువారం లాంఛనంగా చెన్నై లో ఈ చిత్రం ప్రారంభం అయ్యింది. మొత్తం మీద హాట్ బ్యూటీ అమలాపాల్.. ఆన్ స్క్రీన్ నుంచి..ఆఫ్ స్క్రీన్ కు మారిందన్నమాట.