తెలంగాణకు ఏఐసీసీలో నాలుగు పదవులు
వలసల నిరోధానికి అధిష్టానం వ్యూహం తెలంగాణ రాష్ట్రంలో పార్టీనుంచి వలసలు పెరిగిపోతుండటంతో అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏఐసీసీలో నాలుగు పోస్టులు తెలంగాణ నాయకులకు కేటాయించనున్నది. కాంగ్రెస్ వర్కింట్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడి పదవితోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రెండు ఏఐసీసీ కార్యదర్శి పదవులు తెలంగాణకు దక్కనున్నాయి. సీడబ్ల్యూసీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవులకు 50 ఏండ్లు పైబడినవారికి, మిగితా రెండు పదవులు 50 ఏండ్లకంటే తక్కువ వయస్సు ఉన్నవారికి ఇవ్వాలని […]
BY sarvi17 July 2015 12:39 AM GMT
X
sarvi Updated On: 17 July 2015 12:39 AM GMT
వలసల నిరోధానికి అధిష్టానం వ్యూహం
తెలంగాణ రాష్ట్రంలో పార్టీనుంచి వలసలు పెరిగిపోతుండటంతో అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏఐసీసీలో నాలుగు పోస్టులు తెలంగాణ నాయకులకు కేటాయించనున్నది. కాంగ్రెస్ వర్కింట్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడి పదవితోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రెండు ఏఐసీసీ కార్యదర్శి పదవులు తెలంగాణకు దక్కనున్నాయి. సీడబ్ల్యూసీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవులకు 50 ఏండ్లు పైబడినవారికి, మిగితా రెండు పదవులు 50 ఏండ్లకంటే తక్కువ వయస్సు ఉన్నవారికి ఇవ్వాలని పార్టీ వయో పరిమితి విధించినట్లు సమాచారం. ఎవరెవరికి ఏయే పదవులు దక్కుతాయో బహిర్గతం కానప్పటికీ.. రాహుల్‌గాంధీ మార్కు స్పష్టంగా కనిపిస్తుందని విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన భార్యతో కలిసి పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీయే తప్ప మరే ప్రత్యేకత, ప్రాధాన్యం లేదని అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీతో బుధవారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను సోనియాకు వివరించినట్లు తెలిసింది. అయితే సోనియాతో భేటీ సందర్భంగానే తెలంగాణకు ఏఐసీసీ పదవుల గురించి ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. పార్టీలో సీనియర్ నాయకులకు సముచితమైన రీతిలో పదవులు ఇస్తే మిగిలిన వారికి కూడా ఒక మెస్సేజ్ పంపినట్లవుతుందని చెప్పి పార్టీ అధినేత్రిని ఉత్తమ్ ఒప్పించినట్లు సమాచారం. అయితే ఎవరికి ఏఏ పదవులు ఇవ్వాలనేది మాత్రం రాహుల్‌కు చెప్పి ఆయన ఓకే చేసిన తర్వాత మాత్రమే వెల్లడించాలని సోనియా సూచించినట్లు ఏఐసీసీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి రాహుల్ తన టీమ్‌ను తయారు చేసుకుంటున్న సంగతి తెల్సిందే. కొత్తగా ఏఐసీసీలో గానీ, సీడబ్లుసీలో గానీ ఎవరిని నియమించాలన్నా రాహుల్ ఓకే అనాల్సిందేనని ఆ వర్గాలంటున్నాయి.
Next Story