ఏపీకిచ్చిన బొగ్గు గనుల్లో వాటా కోసం టీఎస్ లేఖ
ఒడిసా లోని సర్పాల్-నౌపార్ గనుల్లోని బొగ్గును సగం తమకు కేటాయించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను తెలంగాణ ఇంధనశాఖ కోరింది. తెలంగాణ ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో 6,000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టిందని, ఆ ప్లాంట్లకు బొగ్గు అవసరముందంటూ తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి అరవింద కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమయంలో ఒడిసాలోని సర్పాల్-నౌపార్ గనులను ఏపీకి కేటాయిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 25ను జారీ చేసింది. అంతకుముందే […]
BY sarvi15 July 2015 6:43 PM IST
sarvi Updated On: 16 July 2015 10:17 AM IST
ఒడిసా లోని సర్పాల్-నౌపార్ గనుల్లోని బొగ్గును సగం తమకు కేటాయించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను తెలంగాణ ఇంధనశాఖ కోరింది. తెలంగాణ ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో 6,000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టిందని, ఆ ప్లాంట్లకు బొగ్గు అవసరముందంటూ తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి అరవింద కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమయంలో ఒడిసాలోని సర్పాల్-నౌపార్ గనులను ఏపీకి కేటాయిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 25ను జారీ చేసింది. అంతకుముందే సర్పాల్-నౌపార్ గనుల అభివృద్ధికి ఏపీజెన్‌కో జాయింట్ వెంచర్‌నూ ఏర్పాటు చేసింది. విభజన తర్వాత.. సర్పాల్-నౌపార్ గనులను ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు కేటాయిస్తూ రెండు నెలల క్రితం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ లేఖ కూడా పంపింది. ఆ విషయం తెలుసుకున్న తెలంగాణ ఇంధన శాఖ… తమకూ అవే గనుల్లో 50 శాతం బొగ్గును కేటాయించాలని కోరింది.
Next Story