కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదు: ఉత్తమ్
లోక్‌సభ ఉప ఎన్నికపై తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మాట్లాడానని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ప్రజల నుంచి ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలో సహకరిస్తుందని తాను చెప్పినట్టు తెలిపారు. ఇతర పార్టీల నాయకులను తీసుకోవడం ద్వారా కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని, వీరందరూ ఏదో ఒక రోజు తిరుగుబాటు చేసి కేసీఆర్‌ను మట్టుబెడతారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ […]
లోక్‌సభ ఉప ఎన్నికపై తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మాట్లాడానని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ప్రజల నుంచి ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలో సహకరిస్తుందని తాను చెప్పినట్టు తెలిపారు. ఇతర పార్టీల నాయకులను తీసుకోవడం ద్వారా కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని, వీరందరూ ఏదో ఒక రోజు తిరుగుబాటు చేసి కేసీఆర్‌ను మట్టుబెడతారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరడం వల్ల పార్టీకి ఏమీ నష్టం లేదని, ఆయన గత ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనే గెలవలేక పోయారని ఆయన చెప్పారు.