Telugu Global
Others

జీహెచ్ఎంసీ కార్మికులకు టీ‍ సర్కార్ వార్నింగ్‌

జీహెచ్ ఎంసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సాయంత్రంలోగా సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే… వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని హెచ్చరించింది. డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా… కార్మికులు సమ్మె కొనసాగించడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికులు మొండిగా వ్యవహరిస్తే విధుల నిర్వహణకు రేపటి నుంచి ఆర్మీ, పోలీసులు, ఇతర ఉద్యోగుల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులు కానప్పటికీ… వారిపట్ల సానుభూతితో ఉన్నామని […]

జీహెచ్ ఎంసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సాయంత్రంలోగా సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే… వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని హెచ్చరించింది. డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా… కార్మికులు సమ్మె కొనసాగించడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికులు మొండిగా వ్యవహరిస్తే విధుల నిర్వహణకు రేపటి నుంచి ఆర్మీ, పోలీసులు, ఇతర ఉద్యోగుల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులు కానప్పటికీ… వారిపట్ల సానుభూతితో ఉన్నామని చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తాం… ముందు విధుల్లో చేరండి… అని చెప్పినా కార్మికుల తలకెక్కడం లేదని, ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ అన్నారు.
First Published:  15 July 2015 6:49 PM IST
Next Story