మరో గజనీ... గంటన్నరే అతని జ్ఞాపకశక్తి
గజినీ చిత్రంలో హీరో సూర్య మాదిరిగా లండన్‌లోనూ ఒకరున్నారు. ఆయనకు ఏ విషయమైనా గుర్తు ఉండేది కేవలం 90 నిమషాలు. అంటే గంటన్నర మాత్రమే. గజనీ చిత్రంలో సూర్య కేవలం 15 నిమిషాల షార్ట్ టర్మ్ మెమోరీ లాస్‌తో బాధపడే విషయం సినిమా చూసిన వాళ్ళందరికీ తెలిసిందే. విలియం అనే ఈ బాధితుడు 90 నిమిషాల తర్వాత మీరు కనిపిస్తే మళ్లీ ఎవరని అడుగుతాడు. తెల్లవారు లేవగానే అతనికి ఏ విషయాలూ గుర్తుండవు. విచిత్రమేమిటంటే గజినీ చిత్రంలో […]
BY sarvi16 July 2015 9:28 AM IST

X
sarvi Updated On: 16 July 2015 9:39 AM IST
గజినీ చిత్రంలో హీరో సూర్య మాదిరిగా లండన్‌లోనూ ఒకరున్నారు. ఆయనకు ఏ విషయమైనా గుర్తు ఉండేది కేవలం 90 నిమషాలు. అంటే గంటన్నర మాత్రమే. గజనీ చిత్రంలో సూర్య కేవలం 15 నిమిషాల షార్ట్ టర్మ్ మెమోరీ లాస్‌తో బాధపడే విషయం సినిమా చూసిన వాళ్ళందరికీ తెలిసిందే. విలియం అనే ఈ బాధితుడు 90 నిమిషాల తర్వాత మీరు కనిపిస్తే మళ్లీ ఎవరని అడుగుతాడు. తెల్లవారు లేవగానే అతనికి ఏ విషయాలూ గుర్తుండవు. విచిత్రమేమిటంటే గజినీ చిత్రంలో సూర్య తలపై బలంగా కొట్టడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోతాడు. ఇక్కడ మాత్రం పంటి చికిత్స కోసం వెళ్ళి మెమరీ పొగొట్టుకున్నాడీ అభాగ్యుడు. ఈ కేసుపై లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ గెరాల్డ్ బుర్గెస్ బృందం పరిశోధనలు చేసింది. నార్త్‌హాంప్‌షైర్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌లో సైక్రియాటిస్ట్‌గా సేవలందిస్తున్న భాను చదలవాడ ఈ బృందంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్ళ క్రితం పంటి నొప్పితో బాధపడుతూ విలియం అనే ఈ బాధితుడు ఓ దంతవైద్యుడిని సంప్రదించాడు. ఆ వైద్యుడు రూట్ కెనాల్ చికిత్స చేయడంతో అది వికటించి జ్ఞాపకశక్తి క్షీణతకు దారితీసిందని, దాన్నే ఆంటిరొగ్రేడ్ అమ్నేషియా అంటారని బుర్గేస్ చెప్పారు. శస్త్ర చికిత్స చేసిన నుండి బాధితుడు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి దంతవైద్యుడి వద్దకెళ్లి చికిత్స చేయించుకుంటానని ఇంట్లో వాళ్లతో చెప్తుంటాడట. గంటన్నర తర్వాత ఆ విషయం మరిచిపోయి ఏవేవో పనులు చేసుకుని ఇంటికి వచ్చేస్తాడట!
Next Story