ప్రముఖ గాయకుడు రామకృష్ణ మృతి
ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధ పడుతున్న రామకృష్ణ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మృతి చెందారు. 1947 ఆగస్టు 20న విజయనగరంలో జన్మించిన రామకృష్ణ 200 చిత్రాల్లో ఐదు వేలకు పైగా సినిమా పాటలతోపాటు భక్తిరస ప్రధానమైన ఆల్బమ్‌లను కూడా ఆయన స్వర పరిచారు. భక్తి పాటల ఆలాపననకు రామకృష్ణ పెట్టింది పేరు. ఉషాకిరణ్ మూవీస్ తీసిన నువ్వె కావాలి చిత్రం ఫేమ్ సాయి కిరణ్ రామకృష్ణ కుమారుడు. ప్రముఖ గాయని పి. […]
BY sarvi16 July 2015 5:52 AM IST
X
sarvi Updated On: 16 July 2015 7:24 AM IST
ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధ పడుతున్న రామకృష్ణ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మృతి చెందారు. 1947 ఆగస్టు 20న విజయనగరంలో జన్మించిన రామకృష్ణ 200 చిత్రాల్లో ఐదు వేలకు పైగా సినిమా పాటలతోపాటు భక్తిరస ప్రధానమైన ఆల్బమ్‌లను కూడా ఆయన స్వర పరిచారు. భక్తి పాటల ఆలాపననకు రామకృష్ణ పెట్టింది పేరు. ఉషాకిరణ్ మూవీస్ తీసిన నువ్వె కావాలి చిత్రం ఫేమ్ సాయి కిరణ్ రామకృష్ణ కుమారుడు. ప్రముఖ గాయని పి. సుశీల రామకృష్ణకు పినతల్లి. ఘంటసాల స్ఫూర్తితో సినీ గాయకుడిగా సినిమా రంగంలో ప్రవేశించిన రామకృష్ణ ఆయన మరణించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని సినీ ప్రపంచంతోసహా అందరూ భావించారు. రామకృష్ణ, ఎస్.పి. బాలసుబ్రమణ్యం ఘంటసాల స్థానాన్ని భర్తీ చేయడానికి పోటీ పడ్డారు. రామకృష్ణకు అనేక కారణాల వల్ల అది సాకారం కాలేదు. కాని ఆయన పాడిన పాటలు ఎంతోమంది శ్రోతలను పరవశుల్ని చేశాయి. 1970,80 దశకాల్లో ఆయన అనేక మంది దర్శకులను ప్రభావితం చేసి రామకృష్ణ తప్ప ఈ పాటను మరొకరు పాడలేరనిపించుకున్నారు. అనేక మంది అగ్ర హీరోలకు ఆయనే గాత్ర దానం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభనబాబు, కృష్ణ, కృష్ణంరాజు…. ఇలా అనేక మంది అగ్ర హీరోలకు ఘంటసాల తర్వాత ఆయనే నేపథ్యం గానం చేశారు.
విచిత్రబంధం సినిమాలో ఆయన పాడిన ‘వయసే ఒక పూల తోట… మనసే ఒక పూట బాట…’ తాతా మనవడులో ‘అనుబంధం… ఆత్మీయత అంతా ఒక బూటకం’, కృష్ణవేణిలో ‘తెలుగింటి విరబోణి…’ అందాల రాముడులో ‘ఎదగడానికి ఎందుకురా తొందరా…’ భక్త తుకారాంలో ‘శ్యామ సుందరా… ప్రేమ మందిర…’ భక్త కన్నప్పలో ‘శివ శివ శంకర..భక్తవ శంకర…’ అల్లూరి సీతారామరాజు చిత్రంలో ‘తెలుగు వీర లేవరా..దీక్ష బూని సాగరా…’ దానవీరశూర కర్ణలో జయీభవా… విజయీ భవా’ అన్న పాటలు ఆయన సినీ జీవితంలో ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ఇవే కాకుండా ఆయన అనేక సూపర్ హిట్ చిత్రాల్లో పాడిన పాటలు తెలుగు లోగిళ్ళలో ఇప్పటికీ పాడుకుంటూనే ఉంటారు. తాతామనవడు, భక్త తుకారాం, అందాల రాముడు, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, చక్రవాకం, యశోద కృష్ణ, ముత్యాలముగ్గు, భక్త కన్నప్ప, మహాకవి క్షేత్రయ్య, అమరదీపం, దానవీరశూర కర్ణ, కరుణామయుడు, వయసు పిలిచింది, యువతరం కదిలింది, షిర్డి సాయి మహాత్యం, నిన్నే పెళ్లాడతా వంటి సూపర్ హిట్ మూవీలకు ఆయన అనేక పాటలతో గాత్ర దానం చేసి చిరస్థాయి చరిత్రను లిఖించుకున్నారు. రామకృష్ణ మృతికి సినీరంగం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.
Next Story