Telugu Global
Cinema & Entertainment

మ‌ళ్లీ  రాజమౌళి నే బ‌ద్ద‌లు కొట్టాలి...!

ఇండియాలో బాక్సాఫీస్ రికార్డ్ లంటే  వంద‌కు వంద శాతం బాలీవుడ్ చిత్రాల‌కే  ఎక్కువ ఛాన్స్ వుంది. ఎందుకంటే.. హాలీవుడ్ త‌రువాత‌.. ప్ర‌పంచ మార్కెట్ లో  నెంబ‌ర్  త్రీ ప్లేస్ వున్నది బి టౌన్స్ ఫిల్మ్స్ కే. సో అమీర్ ఖాన్, షారుక్, స‌ల్మాన్ వంటి స్టార్స్ చిత్రాలు  రికార్డ్స్ ను తిర‌గ‌రాస్తూ   దుమ్ము లేపుతున్నారు.   మ‌న తెలుగు చిత్రాల విష‌యంలో మాత్రం  50 కోట్లు వ‌సూలు చేయ‌డ‌మే   చాల గొప్ప విష‌యం.  కొంద‌రు ద‌ర్శ‌కులు నిర్మాత‌లతో విచ్చ‌ల […]

మ‌ళ్లీ  రాజమౌళి నే బ‌ద్ద‌లు కొట్టాలి...!
X

ఇండియాలో బాక్సాఫీస్ రికార్డ్ లంటే వంద‌కు వంద శాతం బాలీవుడ్ చిత్రాల‌కే ఎక్కువ ఛాన్స్ వుంది. ఎందుకంటే.. హాలీవుడ్ త‌రువాత‌.. ప్ర‌పంచ మార్కెట్ లో నెంబ‌ర్ త్రీ ప్లేస్ వున్నది బి టౌన్స్ ఫిల్మ్స్ కే. సో అమీర్ ఖాన్, షారుక్, స‌ల్మాన్ వంటి స్టార్స్ చిత్రాలు రికార్డ్స్ ను తిర‌గ‌రాస్తూ దుమ్ము లేపుతున్నారు.
మ‌న తెలుగు చిత్రాల విష‌యంలో మాత్రం 50 కోట్లు వ‌సూలు చేయ‌డ‌మే చాల గొప్ప విష‌యం. కొంద‌రు ద‌ర్శ‌కులు నిర్మాత‌లతో విచ్చ‌ల విడిగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టించి బ‌డ్జెట్ విప‌రీతంగా పెంచేస్తారు కానీ.. ఆ రేంజ్ లో సినిమాను మార్కెట్ చేయ‌లేక చివ‌ర‌కు నిర్మాత‌కు కన్నీళ్లే మిగుల్చుతారు. అయితే రాజ‌మౌళి మాత్రం డిఫ‌రెంట్. సినిమా క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు.. భారీ బ‌డ్జెట్ అయితే మార్కెట్ ప్లాన్ కూడా డిజైన్ చేసుకో గ‌ల సత్తా వున్న ద‌ర్శ‌కుడు. తాజాగా భారీ హైప్ తో చేసిన బాహుబ‌లి చిత్ర విష‌యంలో రాజ‌మౌళి మార్కెట్ ప్ర‌ణాళిక టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కు కొత్త దారి వేసింది.అంతే కాదు .. 5 రోజుల్లో బాహుబ‌లి చిత్రం 200 వంద‌ల కోట్ల మార్క్ ను దాటి దేశ వ్యాప్తంగా ట్రేడ్ ఎక్స్ ప్ట‌ర్స్ ను షేక్ ఆడిస్తుంది. తెలుగు లో పాటు త‌మిళ్, హింది, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో డ‌బ్ చేశారు. అంత‌ట క‌లిపి 2 వంద‌ల కోట్ల మార్క్ ను దాటింది. జ‌స్ట్ 5 రోజుల‌కే ఈ రేంజ్ వుంటే.. మ‌రో వారం ఇదే జోరు కంటిన్యూ అయితే.. బాహుబ‌లి రికార్డ్ ను కొట్ట‌డం మ‌న తెలుగులో ఇత‌ర హీరోల‌కు సాధ్యం కాద‌నే చెప్పొచ్చు. బ్రేక్ చే్స్తే ..బాహుబ‌లి సెకండ్ పార్ట్ తో రాజ‌మౌళి నే మ‌ళ్లీ చేయాలి.

First Published:  16 July 2015 6:30 AM IST
Next Story