Telugu Global
Others

ఇళ్ళ తొలగింపుతో ఆత్మాహుతి యత్నం!

విజయవాడ రాజీవ్‌నగర్‌ కరకట్ట ప్రాంతంలోని పేదల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమాన్ని బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ వృద్ధురాలు వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు పునరావాసం కల్పించకుండా ఇళ్ళు తొలగించడాన్ని బాధితులు అడ్డుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీశారు. దీంతో 200 మందికిపైగా ఉన్న పోలీసు బలగాలు అడ్డువచ్చిన వారిని, మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. ప్రొక్లెయినర్తో వచ్చిన అధికారులు అక్కడ నివాసం ఉంటున్న వారందరినీ […]

విజయవాడ రాజీవ్‌నగర్‌ కరకట్ట ప్రాంతంలోని పేదల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమాన్ని బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ వృద్ధురాలు వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు పునరావాసం కల్పించకుండా ఇళ్ళు తొలగించడాన్ని బాధితులు అడ్డుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీశారు. దీంతో 200 మందికిపైగా ఉన్న పోలీసు బలగాలు అడ్డువచ్చిన వారిని, మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. ప్రొక్లెయినర్తో వచ్చిన అధికారులు అక్కడ నివాసం ఉంటున్న వారందరినీ ఇళ్ల నుండి బయటకు రావల్సిందిగా మైకు ద్వారా చెప్పి తొలగింపు చర్యను చేపట్టారు. జెసిబితో తీవ్ర ఉద్రిక్తత నడుమ సుమారు వెయ్యికిపైగా ఇళ్లను తొలగించారు. రాజీవ్‌నగర్‌ ఎడమ కట్ట నుండి వడ్డెర కాలనీ కట్టపై ఇళ్లను సైతం కూల్చివేశారు. కూల్చివేసిన ఇళ్లకు ఎన్యుమరేషన్‌ జరపలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టిడిపి ప్రభుత్వం విజయవాడ నగరంలో నివసిస్తున్న పేదలను నగరానికి దూరంగా గెంటేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బాధితులకు తక్షణం ప్రత్యామ్నాయం చూపించాలని, ఎన్యుమరేషన్‌ జరిపి అందరికీ ఇళ్లు ఇవ్వాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి.​
First Published:  15 July 2015 1:09 PM GMT
Next Story