ముసునూరు ‘పశ్చిమ’లోదే
ఇసుక రీచ్ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ డి.వనజాక్షి మధ్య వివాదానికి దారితీసిన ప్రాంతం… పశ్చిమగోదావరి జిల్లాలోనిదేనని రెవెన్యూ అధికారులు తేల్చారు. నూజివీడు ఆర్డీవో సీహెచ్ రంగయ్య, ఏలూరు ఆర్డీవో తేజభరత్ ఆధ్వర్యంలో బుధవారం రెండు జిల్లాల రెవెన్యూ అధికారులు సరిహద్దు ప్రాంతమైన రంగంపేట ఇసుకరీచ్‌లో తమ్మిలేరులోని భూభాగాన్ని కొలిచారు. సర్వే నంబర్ 202లోని మూడెకరాల 62 సెంట్ల భూభాగం తమ్మిలేరులో కృష్ణా జిల్లా ప్రాంతంగా […]
BY sarvi15 July 2015 1:15 PM GMT
sarvi Updated On: 16 July 2015 5:29 AM GMT
ఇసుక రీచ్ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ డి.వనజాక్షి మధ్య వివాదానికి దారితీసిన ప్రాంతం… పశ్చిమగోదావరి జిల్లాలోనిదేనని రెవెన్యూ అధికారులు తేల్చారు. నూజివీడు ఆర్డీవో సీహెచ్ రంగయ్య, ఏలూరు ఆర్డీవో తేజభరత్ ఆధ్వర్యంలో బుధవారం రెండు జిల్లాల రెవెన్యూ అధికారులు సరిహద్దు ప్రాంతమైన రంగంపేట ఇసుకరీచ్‌లో తమ్మిలేరులోని భూభాగాన్ని కొలిచారు. సర్వే నంబర్ 202లోని మూడెకరాల 62 సెంట్ల భూభాగం తమ్మిలేరులో కృష్ణా జిల్లా ప్రాంతంగా రెండు జిల్లాల ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు సర్వే రాళ్లు పాతి రికార్డులను తయారు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ల్యాండ్ అండ్ సర్వేయర్ పి.వి సత్యనారాయణ, కృష్ణా జిల్లా సర్వేయర్ కుమార్‌లు ఈ తమ్మిలేరులోని వాటాలను విభజించారు. ఇరు జిల్లాల ఆర్డీవోలు మీడియాతో మాట్లాడుతూ ఇసుక రవాణా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోనే జరిగిందని, కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారులకు ఈ ప్రాంతంలో అధికారాలు లేవని వారు తెలిపారు.
Next Story