ఏపీకి 253 కోట్ల ‘రూసా’ నిధులు
రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.253 కోట్ల నిధులు మంజూరయ్యాయి. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్ (ఎస్‌పీడీ) ఏర్పాటు కోసం రూ.3.5 కోట్లు, ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలకు రూ.250 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కార్యక్రమ పురోగతిపై కేంద్ర సర్కారు సంతృప్తి చెందటంతోపాటు సెప్టెంబర్ నాటికి ఆయా నిధులను వినియోగించినట్లయితే త్వరలో మరో రూ.300 కోట్లు విడుదల చేసేందుకు కూడా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. […]
BY sarvi15 July 2015 6:44 PM IST
sarvi Updated On: 16 July 2015 10:31 AM IST
రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.253 కోట్ల నిధులు మంజూరయ్యాయి. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్ (ఎస్‌పీడీ) ఏర్పాటు కోసం రూ.3.5 కోట్లు, ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలకు రూ.250 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కార్యక్రమ పురోగతిపై కేంద్ర సర్కారు సంతృప్తి చెందటంతోపాటు సెప్టెంబర్ నాటికి ఆయా నిధులను వినియోగించినట్లయితే త్వరలో మరో రూ.300 కోట్లు విడుదల చేసేందుకు కూడా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ మోడల్‌గా ఉందంటూ కితాబు ఇచ్చింది. ‘రూసా’ కింద ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులను వ్యయం చేసినట్లు యూ.సీ.లు సమర్పిస్తే 2015-16 విద్యా సంవత్సరంలో రాష్ట్రానికి దాదాపు రూ.1,000 కోట్ల వరకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Next Story