విడాకులు పొందిన భార్య పై యాసిడ్ దాడి
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో దారుణం చోటు చేసుకుంది. రెజీనాపై విడాకులు తీసుకున్న భర్త ఖాజా యాసిడ్ దాడి చేశాడు. దీనితో ఆమెను రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రెజీనా పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. కుటుంబ కలహాలే ఈ సంఘటనకు కారణమని తెలుస్తోంది. వ్యసనాలకు బానిసైన భర్తను విడాకులతో వదిలించుకున్నా ఏడాదిన్నరగా పలుమార్లు హతమార్చడానికి యత్నించడమే కాక.. ఈసారి మరింత రెచ్చిపోయి పథకం ప్రకారం ఆమెపై యాసిడ్ దాడికి తెగబడ్డాడు. […]
BY sarvi16 July 2015 7:01 AM IST
X
sarvi Updated On: 16 July 2015 7:01 AM IST
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో దారుణం చోటు చేసుకుంది. రెజీనాపై విడాకులు తీసుకున్న భర్త ఖాజా యాసిడ్ దాడి చేశాడు. దీనితో ఆమెను రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రెజీనా పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. కుటుంబ కలహాలే ఈ సంఘటనకు కారణమని తెలుస్తోంది. వ్యసనాలకు బానిసైన భర్తను విడాకులతో వదిలించుకున్నా ఏడాదిన్నరగా పలుమార్లు హతమార్చడానికి యత్నించడమే కాక.. ఈసారి మరింత రెచ్చిపోయి పథకం ప్రకారం ఆమెపై యాసిడ్ దాడికి తెగబడ్డాడు. చంద్రగిరికి చెందిన జరీనా బేగంతో తిరుపతికి చెందిన ఖాజాహుసేన్‌కు నాలుగేళ్ళ క్రితం వివాహం జరిగింది. విద్యాధికురాలైన జరీనా పీలేరు డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తుండగా.. హుసేన్ మాత్రం జులాయిగా తిరుగుతూ.. వ్యసనాలకు బానిసై.. భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఈ వేధింపులను భరించలేని జరీనా.. గత యేడాది ఇస్లాం సంప్రదాయం ప్రకారం మత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుంది. అయితే.. సంపాదించే భార్య తనను వదిలిపెట్టడంతో హుసేన్ కసి పెంచుకుని, తనతో కాపురం చేయాల్సిందేనని వేధించాడు. దారికాచి భయపెట్టాడు. దీనిపై జరీనా తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు తప్ప హుసేన్‌పై చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో హుసేన్ మరోసారి ఈ ఏడాది జనవరి 26న పీలేరు బస్టాండులో జరీనాపై దాడికి యత్నించాడు. మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేసినా చలనం లేదు. గత నెల 22న పీలేరులో ఆమెపై హుసేన్ కత్తితో దాడి చేశాడు. ప్రాణభయంతో పరుగులు తీసిన జరీనా పోలీసుస్టేషన్‌కు చేరుకుని మూడోసారి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పీలేరు పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి చేతులు దులుపు కున్నారు. ఈ నేపథ్యంలో హుసేన్ మరింత రెచ్చిపోయి.. బుధవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి తిరిగివెళ్లే క్రమంలో ఆటో కోసం ఎదురుచూస్తున్న జరీనాను జుట్టుపట్టి వెనక్కు వంచి.. మొహంపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడిలో జరీనా ముఖంతో పాటు కాళ్లూచేతులు కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. హాహాకారాలు చేస్తున్న జరీనాను అక్కడున్న ప్రయాణికులు చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు చేర్చారు. అక్కడి నుంచి చంద్రగిరి పోలీసులు ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబసభ్యులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పుష్కరాల ప్రాంతంలో ఉన్న సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు… నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను ఆదేశించారు.
Next Story