ధనుష్ వ్యాపారం బావుంది..!
తమిళ హీరోలకు తెలుగు నాట మంచి మార్కెట్ ఉంది. ఉందనడం కంటే.. వాళ్లు డెబ్యూ సినిమా నుంచే తెలుగు ఇండస్ట్రీని ఫోకస్ చేస్తారు. అలనాటి లెజండ్రీ హీరో యంజీ ఆర్ నుంచి ఇప్పటి యువ హీరోలు జీవ, ఉదయనిధి స్టాలిన్.. శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు… జై వంటి వారందరు తమ మొదటి చిత్రం నుంచే టాలీవుడ్ లో తమ సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేసారు. ఇక కమల్ హాసన్, రజనీకాంత్ ల్ని మన […]
తమిళ హీరోలకు తెలుగు నాట మంచి మార్కెట్ ఉంది. ఉందనడం కంటే.. వాళ్లు డెబ్యూ సినిమా నుంచే తెలుగు ఇండస్ట్రీని ఫోకస్ చేస్తారు. అలనాటి లెజండ్రీ హీరో యంజీ ఆర్ నుంచి ఇప్పటి యువ హీరోలు జీవ, ఉదయనిధి స్టాలిన్.. శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు… జై వంటి వారందరు తమ మొదటి చిత్రం నుంచే టాలీవుడ్ లో తమ సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేసారు. ఇక కమల్ హాసన్, రజనీకాంత్ ల్ని మన తెలుగు హీరోలే అనుకునే పరిస్థితి వుంది. కట్ చేస్తే ధనుష్ కు మాత్రం తెలుగు నాట చాల కాలం వరకు పెద్దగా గుర్తింపు రాలేదు. చూడటానికి హీరో మెటిరియల్ కాదనిపించే ధనుష్ ను హీరో గా ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానకే చాల కాలం పట్టింది.
కట్ చేస్తే.. ఆడు కాలం చిత్రంతో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టి తన సత్తాను చాటుకున్నాడు. అలాగే తన కెరీర్ లో 25 వ చిత్రంగా చేసిన రఘవరన్ బిటెక్ చిత్రం ధనుష్ ను తెలుగు అభిమానులకు బాగా రీచ్ చేసింది. దీంతో ధనుష్ తమిళ్ నాట నటించిన చిత్రాలన్ని వరసబెట్టి తెలుగు డబ్ చేసి వదలుతున్నారు. అందులో భాగంగా.. మారియన్ చిత్రం ఒకటి ఈ నెల 31 న రిలీజ్ చేయడానికి రంగం సిద్దం చేశారు.ఈ చిత్రంలో పార్వతి మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. తెలుగులో నిర్మాత శొభారాణి సమర్పిస్తున్నారు. ఒక వైవిధ్యమైన పాయింట్ తో దర్శకుడు భరత్ బాల చేసిన ఈ చి్త్రం తెలుగు అభిమానుల్ని ఎంత వరకు అలరిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.