Telugu Global
Family

జీవనయానం (Devotional)

బహాయుద్దీన్‌ ఎల్‌-షా గొప్ప సూఫీ గురువు. ఆయన శిష్యులతో పాటు బొఖారా ప్రాంతంలోని ఒక నాలుగురోడ్ల కూడలిలో ఉన్నాడు. అప్పుడు ఒక అజ్ఞాత మార్మికుడయిన దేశసంచారి ఎదురుపడ్డాడు. అతను ఏదో లోకాలకేసి చూస్తున్నట్లు ఈ భూమిపైనే లేనట్లు ఉన్నాడు. బహాయుద్దీన్‌ అతన్ని చూసి “ఎక్కడినించి వస్తున్నావు”అని అడిగాడు. అది సూఫీ ధర్మం. అతను “ఏమో నాకు తెలీదు” అన్నాడు. కొంతమంది బహాయుద్దీన్‌ శిష్యులు ఆ సమాధానంతో ఆగ్రహించారు. తమ గురువును ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా అవమానించినట్లు భావించారు. […]

బహాయుద్దీన్‌ ఎల్‌-షా గొప్ప సూఫీ గురువు. ఆయన శిష్యులతో పాటు బొఖారా ప్రాంతంలోని ఒక నాలుగురోడ్ల కూడలిలో ఉన్నాడు. అప్పుడు ఒక అజ్ఞాత మార్మికుడయిన దేశసంచారి ఎదురుపడ్డాడు. అతను ఏదో లోకాలకేసి చూస్తున్నట్లు ఈ భూమిపైనే లేనట్లు ఉన్నాడు.

బహాయుద్దీన్‌ అతన్ని చూసి “ఎక్కడినించి వస్తున్నావు”అని అడిగాడు. అది సూఫీ ధర్మం.

అతను “ఏమో నాకు తెలీదు” అన్నాడు.

కొంతమంది బహాయుద్దీన్‌ శిష్యులు ఆ సమాధానంతో ఆగ్రహించారు. తమ గురువును ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా అవమానించినట్లు భావించారు. బహాయుద్దీన్‌కు ఆ ఆగంతకుడికి మధ్య సంభాషణ ఇలా సాగింది.

“ఎక్కడికి వెళుతున్నావు?”

“నాకు తెలీదు”

“ఏది మంచిది?”

“నాకు తెలీదు”

“ఏది పాపం?”

“తెలీదు”

“ఏది సరయింది?”

“నాకు మంచి అనిపించింది”

“ఏది తప్పు”

“నాకు చెడ్డ అనిపించింది”

ఆ సమాధానాలకు శిష్యులు బాగా కోపగించారు. అతన్ని అక్కడినించి తోసేశారు. అతను అక్కడి నించీ వెళ్ళి ఎత్తుగా ఉన్న ఒక రాతిమీద కాలిబాట కూడా లేని చోట నిల్చున్నాడు.

బహాయుద్దీన్‌ అతన్ని పరిశీలించి అతని జ్ఞానానికి ఆశ్చర్యపడి శిష్యుల్ని మందలించి “బుద్ధిహీనుల్లారా అతను మానవత్వం గురించి వివరిస్తున్నాడు. మీరు అతన్ని తక్కువ చేసే కొద్దీ కావాలని అట్లా ప్రవర్తిస్తున్నాడు. మీరు ఎంత స్పృహలో లేరో, మంద బుద్ధులో అతని మాటల్ని బట్టి గ్రహించండి. మీ అనుదిన జీవన గమనం పట్ల మీలో చైతన్యముందా? అతని మాటల్లోని సత్యాన్ని గ్రహించండి” అన్నాడు.

– సౌభాగ్య

First Published:  15 July 2015 6:31 PM IST
Next Story