గోదావరి జలాల అనుసంధానంతోనే ప్రగతి: బాబు
గోదావరి నదీజలాలను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధించగలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జరిగిన కె.ఎల్.రావు 113వ శయంతి సభ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, శ్రీశైలంలోని నాగార్జునసాగర్ నిర్మాణంలో ఇరిగేషన్ నిపుణుడు కె.ఎల్.రావు సూచించిన విధంగా గోదావరి-కృష్ణా, గోదావరి-పెన్నా, గోదావరి-వంశధార నదులను అనుసంధానం చేయాలని ప్రభుత్వం సంకల్పించిం దన్నారు. జాతీయస్థాయిలో నదులను అనుసంధానించాలన్న మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆలోచనలతో సురేష్‌ప్రభు […]
BY sarvi15 July 2015 6:48 PM IST
sarvi Updated On: 16 July 2015 11:09 AM IST
గోదావరి నదీజలాలను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధించగలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జరిగిన కె.ఎల్.రావు 113వ శయంతి సభ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, శ్రీశైలంలోని నాగార్జునసాగర్ నిర్మాణంలో ఇరిగేషన్ నిపుణుడు కె.ఎల్.రావు సూచించిన విధంగా గోదావరి-కృష్ణా, గోదావరి-పెన్నా, గోదావరి-వంశధార నదులను అనుసంధానం చేయాలని ప్రభుత్వం సంకల్పించిం దన్నారు. జాతీయస్థాయిలో నదులను అనుసంధానించాలన్న మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆలోచనలతో సురేష్‌ప్రభు ఆధ్వర్యాన టాస్క్‌ఫోర్స్ వేశారన్నారు. యుపిఎ ప్రభుత్వం దీన్ని విస్మరించిందన్నారు. వరదలొచ్చినప్పుడు మూడు వేల టిఎంసిల గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయన్నారు. దీనిలో వెయ్యి టిఎంసిలు ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దగలమన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా రాయలసీమలో బంగారం పండించొచ్చనీ, అత్యంత తక్కువ సాగు చేస్తున్న అనంతపురం జిల్లాకు మేలు చేయొచ్చనీ అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం, నదుల అనుసంధానాన్ని ప్రజలంతా సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సిఎం చంద్రబాబు అన్నారు.
Next Story