ప్రభుత్వానిదే బాధ్యత.. బాబుది కాదు.. నారాయణ గందరగోళ వ్యాఖ్యలు
సీపీఐ నాయకుడు కె.నారాయణ ఏం మాట్లాడినా సంచలనమే. ఏం చేసినా చర్చనీయాంశమే. అందరూ నడిచే దారి ఆయనకు సరిపడదు. అందరూ ఆలోచించే తీరు ఆయనకు అస్సలు నచ్చదు. తాజాగా ఆయన గోదావరి పుష్కరాలలో పిండప్రదానాలు చేస్తున్న భక్తులపై వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తల్లిదం డ్రులకు పిండం పెట్టడం కన్నా.. బతికున్నప్పుడు తిండి పెట్టాలని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అయితే చంద్రబాబు రాజీనామా చేయనక్కర్లేదన్నారు. వైఫల్యం ప్రభుత్వానిదే తప్ప చంద్రబాబుది కాదన్నారు. అదేమిటి మరి […]
BY Pragnadhar Reddy16 July 2015 5:15 AM IST
X
Pragnadhar Reddy Updated On: 16 July 2015 5:32 AM IST
సీపీఐ నాయకుడు కె.నారాయణ ఏం మాట్లాడినా సంచలనమే. ఏం చేసినా చర్చనీయాంశమే. అందరూ నడిచే దారి ఆయనకు సరిపడదు. అందరూ ఆలోచించే తీరు ఆయనకు అస్సలు నచ్చదు. తాజాగా ఆయన గోదావరి పుష్కరాలలో పిండప్రదానాలు చేస్తున్న భక్తులపై వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తల్లిదం డ్రులకు పిండం పెట్టడం కన్నా.. బతికున్నప్పుడు తిండి పెట్టాలని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అయితే చంద్రబాబు రాజీనామా చేయనక్కర్లేదన్నారు. వైఫల్యం ప్రభుత్వానిదే తప్ప చంద్రబాబుది కాదన్నారు. అదేమిటి మరి వైఫల్యం ప్రభుత్వానిదైతే ప్రభుత్వాధినేతకు ఆ వైఫల్యం అంటదా అని విలేకరులు తలలు బద్దలు కొట్టుకోవలసి వచ్చింది. ఇందులో ప్రభుత్వాధినేతగా చంద్రబాబు బాధ్యత ఏమిటి? ఆయనకు బాధ్యత లేదా? నారాయణ ఇలా వ్యాఖ్యానించడమేమిటి? అని ఆయన వెంట వచ్చిన వారు కూడా గొణుక్కోవడం వినిపించింది. అయితే నారాయణ అలా మాట్లాడకపోతే వింత. అలా మాట్లాడడం ఆయన హక్కు కదా అని అందరూ సరిపెట్టుకుని ముందుకు సాగారు. ఇంతకీ ఈ గందరగోళం ఎక్కడంటే…. రాజమండ్రి ప్రభు త్వాస్పత్రిలో చికిత్సపొందుతున్న పుష్కర ఘాట్ తొక్కిసలాట క్షతగాత్రులను పరామర్శించడానికి నారాయణ వచ్చారు.. ఆ సందర్భంగా అన్నమాట. ప్రమాద ఘటన తీరును నారాయణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 12 ఏళ్లకోసారి జరిగే పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ పుష్కరాల్లో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి వంటి మతతత్త్వ శక్తులు చొరబడి ఆధ్యాత్మికతను కలుషితం చేస్తున్నాయన్నారు. ప్రమాద ఘటనల్లో మృతులకు ప్రభుత్వం అన్నివిధాలా సాయమందించాలన్నారు.
Next Story