Telugu Global
Others

అక్టోబరు 2న అన్నా హజారే మళ్ళీ దీక్ష

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున మరోసారి నిరాహార దీక్షకు దిగనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం. భూసేకరణ బిల్లు, విశ్రాంత భద్రతా సిబ్బందికి వన్‌ ర్యాంక్‌- వన్‌ పెన్షన్ విధానానికి నిరసనగా హజారే ఈదీక్ష చేపడుతున్నారు. ఎలాగైనా వివాదాస్పద భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్న బిజెపికి అన్నా దీక్ష శరాఘాతంలా తగలనుంది. భూసేకరణ చట్టాన్ని అన్నా ఎప్పటి నుంచో […]

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున మరోసారి నిరాహార దీక్షకు దిగనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం. భూసేకరణ బిల్లు, విశ్రాంత భద్రతా సిబ్బందికి వన్‌ ర్యాంక్‌- వన్‌ పెన్షన్ విధానానికి నిరసనగా హజారే ఈదీక్ష చేపడుతున్నారు. ఎలాగైనా వివాదాస్పద భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్న బిజెపికి అన్నా దీక్ష శరాఘాతంలా తగలనుంది. భూసేకరణ చట్టాన్ని అన్నా ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వివాదాస్పదమైన పలు విషయాలను ప్రస్తావిస్తూ, ప్రధాని మోడికి లేఖ రాశారు. ఒఆర్‌ఒపి విధానంపై చర్చించేందుకు అన్నా గురువారం మాజీ రక్షణ శాఖ అధికారుల్ని కలవనున్నారు. ఇటీవల అన్నా మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం భూసేకరణ బిల్లును గట్టేక్కించేందుకు చూపిస్తున్న ప్రేమ ఒఆర్‌ఒపి విధానం అమలుపై పెట్టడం లేదని విమర్శించారు.
First Published:  15 July 2015 6:41 PM IST
Next Story