మున్సిపల్ సమ్మెకు మద్దతుగా ప్రారంభమైన వామపక్షాల దీక్ష
మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మెకు వామపక్షాలు అండగా నిలిచి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాయి. సమ్మెకు ప్రభుత్వం స్పందించకుండా నాటకాలాడుతోందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించాయి. అందుకే తాము రంగంలోకి దిగుతున్నామని, ప్రభుత్వం దిగి వచ్చి వారి డిమాండ్లు నెరవేర్చే వరకు తాము నిరాహారదీక్షలు చేపడతామని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు తెలిపారు. సమ్మె చేస్తున్నా పట్టించుకొకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దానికి నిరసనగా ప్రభుత్వ తీరును ఖండిస్తూ కార్మికులు, వామపక్షాల పార్టీలు బుధవారం […]
BY sarvi14 July 2015 6:43 PM IST
sarvi Updated On: 15 July 2015 11:50 AM IST
మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మెకు వామపక్షాలు అండగా నిలిచి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాయి. సమ్మెకు ప్రభుత్వం స్పందించకుండా నాటకాలాడుతోందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించాయి. అందుకే తాము రంగంలోకి దిగుతున్నామని, ప్రభుత్వం దిగి వచ్చి వారి డిమాండ్లు నెరవేర్చే వరకు తాము నిరాహారదీక్షలు చేపడతామని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు తెలిపారు. సమ్మె చేస్తున్నా పట్టించుకొకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దానికి నిరసనగా ప్రభుత్వ తీరును ఖండిస్తూ కార్మికులు, వామపక్షాల పార్టీలు బుధవారం నుంచి ఇందిరాపార్క్ వద్ద నిరహారదీక్ష దిగాయని రాఘవులు తెలిపారు. ఈ దీక్షలు సిపియం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేకుంటే సమ్మె ఇంకా తీవ్ర రూపం దాలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందిని…వెట్టి చాకిరి చేయించుకుంటూ కార్మికుల కనీస అవసరాలు తీర్చడం లేదని విమర్శించారు. రేపటి నుంచి మూడు రోజులలో సమస్యను పరిష్కరించకుంటే నిరవధిక నిరహార దీక్షకైనా వెనుకాడబోమన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని మనం పట్టుదలతో ముందుకు వెళ్లితే ప్రభుత్వమే దిగొస్తుందని కార్మికులకు తమ్మినేని పిలుపునిచ్చారు. మూడు రోజులపాటు చేపట్టే ఈ దీక్షలకు కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఆ తర్వాత రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వానికి వారికి కనీస అవసరాలు తీర్చలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.
Next Story