ముంబై పేలుళ్ల దోషి మెమన్‌కు 30న ఉరి
ముంబై పేలుళ్ళకు ఆర్థికంగా బాసటగా నిలిచిన యాకుబ్ మెమన్ ఉరికి రంగం సిద్ధమైంది. ఆయన్ని ఈనెల 30న ఉరి తీయనున్నారు. దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం పంపించారు. జులై 21న అతడు దాఖలు చేసే కూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరిస్తే నాగపూర్ సెంట్రల్ జైలులో 30వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరితీస్తారు. 14 సంవత్సరాలుగా మెమన్ జైలు జీవితం అనుభవిస్తున్నాడు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అతని ఉరికి అన్ని ఏర్పాట్లు […]
BY sarvi15 July 2015 10:42 AM IST
X
sarvi Updated On: 15 July 2015 10:43 AM IST
ముంబై పేలుళ్ళకు ఆర్థికంగా బాసటగా నిలిచిన యాకుబ్ మెమన్ ఉరికి రంగం సిద్ధమైంది. ఆయన్ని ఈనెల 30న ఉరి తీయనున్నారు. దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం పంపించారు. జులై 21న అతడు దాఖలు చేసే కూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరిస్తే నాగపూర్ సెంట్రల్ జైలులో 30వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరితీస్తారు. 14 సంవత్సరాలుగా మెమన్ జైలు జీవితం అనుభవిస్తున్నాడు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అతని ఉరికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన మెమన్ (53) ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరస్కరించారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తామని మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. 1993 మార్చ్ 12న జరిగిన ముంబై వరుస పేలుళ్లకు యాకుబ్ మెమన్ ధనాన్ని సమకూర్చాడు. నాటి వరుస 13 పేలుళ్లలో 257 మంది చనిపోయారు. 700 మంది గాయపడ్డారు. ఈ కేసులో మెమన్ దోషిగా తేలడంతో ముంబైలోని ప్రత్యేక టాడా కోర్టు 2007 జులై 27న అతడికి ఉరిశిక్ష విధించింది. 1993 పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న నిందితుల్లో తొలి వ్యక్తి యాకుబ్ మెమనే కావడం గమనార్హం.
Next Story