ములాయంపై కేసు పెట్టిన అధికారి సస్పెండ్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్‌పై కేసు పెట్టిన పోలీస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణారాహిత్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఠాకూర్ ఆస్తి , ఆదాయ వివరాలు అసంపూర్తిగా ఇచ్చారని హోంశాఖ ఆరోపించింది. డీజీపీ అనుమతి లేనిదే ఆయన రాష్ట్ర సరిహద్దులు దాటరాదని షరతులు విధించింది. 1992 బ్యాచ్‌కు చెందన ఠాకూర్ ఇప్పటి వరకు […]
BY sarvi14 July 2015 6:36 PM IST
sarvi Updated On: 15 July 2015 5:20 AM IST
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్‌పై కేసు పెట్టిన పోలీస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణారాహిత్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఠాకూర్ ఆస్తి , ఆదాయ వివరాలు అసంపూర్తిగా ఇచ్చారని హోంశాఖ ఆరోపించింది. డీజీపీ అనుమతి లేనిదే ఆయన రాష్ట్ర సరిహద్దులు దాటరాదని షరతులు విధించింది. 1992 బ్యాచ్‌కు చెందన ఠాకూర్ ఇప్పటి వరకు 30 సార్లు బదిలీ కాగా, మూడుసార్లు సస్పెండ్ అయ్యారు.
Next Story