లేజర్ కిరణాలతో వేగంగా పాలమూరు సర్వే
అత్యంత ఆధునిక టెక్నాలజీ లేజర్ కిరణాల ద్వారా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అనుగుణంగా తొలిసారిగా లేజర్ విధానంలో సర్వే చేయాలని నిర్ణయించింది. అందుకోసం సుమారు వంద మంది ఇంజనీర్లకు మంగళవారం గచ్చిచౌలిలోని ఇంజినీర్స్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎస్కీ)లో శిక్షణా తరగతులు నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భూమి మీదనే లేజర్ సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వే ప్రకారం లేజర్ కిరణాల ద్వారా దూరాన్ని కొలుస్తారు. సుమారు […]
BY sarvi14 July 2015 6:35 PM IST
sarvi Updated On: 15 July 2015 5:19 AM IST
అత్యంత ఆధునిక టెక్నాలజీ లేజర్ కిరణాల ద్వారా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అనుగుణంగా తొలిసారిగా లేజర్ విధానంలో సర్వే చేయాలని నిర్ణయించింది. అందుకోసం సుమారు వంద మంది ఇంజనీర్లకు మంగళవారం గచ్చిచౌలిలోని ఇంజినీర్స్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎస్కీ)లో శిక్షణా తరగతులు నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భూమి మీదనే లేజర్ సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వే ప్రకారం లేజర్ కిరణాల ద్వారా దూరాన్ని కొలుస్తారు. సుమారు 50 ఫీట్ల ఎత్తు మీద నుంచి కిందనున్న వాటిని సర్వే చేస్తారు. ఈ సర్వేకు టార్రాస్పియల్ లేజర్ స్కానర్‌ను వినియోగిస్తామని, అత్యంత వేగంగా, చిన్న లోపం లేకుండా వివరాలు వస్తాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా చేసే సర్వేలకు రెండు మూడు నెలల సమయం పడితే, లేజర్ సర్వేకు గరిష్టంగా 15 నుంచి 20 రోజుల సమయం మాత్రమే పడుతుందని, అందువల్ల వారం రోజుల్లోనే అంచనాలు రూపొందించి పది పదిహేను రోజుల వ్యవధిలోనే టెండర్లు పిలవడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు మొదటివారంలో టెండర్లను పిలుస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Next Story