ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో జపాన్ పంపులు
థర్మల్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో బొగ్గును మండించినప్పుడు వచ్చే బూడిదను బాయిలర్లలో ఉన్నప్పుడే బైటకు పంపే భారీ సైజు పంపులను జపాన్ కంపెనీ ఎబెల్ నుంచి రూ. 16.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పంపుల నాణ్యతను పరిశీలంచకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గిన ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి..ఎబెల్ సంస్థ మొదట కాంట్రాక్ట్ కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పుడు అధికారులు పంపులు అవసరం లేదని బీహెచ్ఈఎల్ సరఫరా చేస్తున్న పైపులతో […]
BY sarvi14 July 2015 6:39 PM IST
sarvi Updated On: 15 July 2015 6:14 AM IST
థర్మల్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో బొగ్గును మండించినప్పుడు వచ్చే బూడిదను బాయిలర్లలో ఉన్నప్పుడే బైటకు పంపే భారీ సైజు పంపులను జపాన్ కంపెనీ ఎబెల్ నుంచి రూ. 16.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పంపుల నాణ్యతను పరిశీలంచకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గిన ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి..ఎబెల్ సంస్థ మొదట కాంట్రాక్ట్ కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పుడు అధికారులు పంపులు అవసరం లేదని బీహెచ్ఈఎల్ సరఫరా చేస్తున్న పైపులతో ఏ యూనిట్‌లోనూ సమస్య తలెత్తలేదని సర్కార్‌కు నోట్ పంపారు. అయితే, ఏమైందో తెలియదు కానీ జెన్‌కో అధికారులు తిరిగి ఎబెల్ అధికారులతో సంప్రదింపులు ప్రారంభించారు. జెన్‌కో పరిధిలోని మొత్తం యూనిట్లలో 33 పంపులను ఎబెల్ కంపెనీవే ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ కాంట్రాక్ట్‌పై ఈనెల 17వ తేదీన ప్రత్యేక సమావేశంలో ఎబెల్ కంపెనీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులపై ప్రభుత్వం తెస్తోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. పైపుల పనితీరు పరిశీలించకుండా ఒప్పందం కుదుర్చుకుంటే, అవి పని చేయకపోతే, రూ. 16.5 కోట్లు బూడిదలో పోసినట్లు అవుతుందని పలువురు అధికారులు భావిస్తున్నారు.
Next Story