బాహుబలి 400 వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా..!
ప్రపంచం వ్యాప్తంగా అలరిస్తున్న మన బాహుబలి కలెక్షన్ల మీద ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ అంచనాలు ఒక రేంజ్ లో వున్నాయి. ఈ చిత్రం విడుదలైన అన్ని లాంగ్వేజెస్ లో కలెక్షన్స్ 170 కోట్లు దాటింది. మూడో రోజుకే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే… రెండు వారాలు పాటు బాక్సాఫీస్ దగ్గర 80 పర్సెంట్ స్టస్టెయిన్ అయితే వసూళ్లు 4 వందల కోట్లు తేలిగ్గా దాటుతుందనేది ఫిల్మ్ ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ అంచనా. ఈ చిత్రం బాలీవుడ్ లో […]
ప్రపంచం వ్యాప్తంగా అలరిస్తున్న మన బాహుబలి కలెక్షన్ల మీద ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ అంచనాలు ఒక రేంజ్ లో వున్నాయి. ఈ చిత్రం విడుదలైన అన్ని లాంగ్వేజెస్ లో కలెక్షన్స్ 170 కోట్లు దాటింది. మూడో రోజుకే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే… రెండు వారాలు పాటు బాక్సాఫీస్ దగ్గర 80 పర్సెంట్ స్టస్టెయిన్ అయితే వసూళ్లు 4 వందల కోట్లు తేలిగ్గా దాటుతుందనేది ఫిల్మ్ ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ అంచనా. ఈ చిత్రం బాలీవుడ్ లో మూడు రోజులకే 22 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. కోలీవుడ్ లో దుమ్ము లేపేస్తుంది. ఇక నుంచి ప్రభాస్ , రానా చిత్రాలకు అక్కడ బంపర్ మార్కెట్ ఏర్పడే విధంగా బాహుబలి చిత్రం తమిళ్ ఆడియన్స్ కు రీచ్ చేసింది. కర్ణాటక లో తెలుగు వెర్షన్ కలెక్షన్సే 22 కోట్లు చేసిందటే.. బాహుబలి జోరు మాటల్లో చెప్పనలవి కాదు. మొత్తం మీద బాహుబలి మొదటి భాగం బిజినెస్ అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 4 వందల పై చిలుకు చేస్తుంది అనేది అందరి నమ్మకం మరి.!