పాలమూరుపై చర్చకు తోకముడిచిన టీడీపీ
పాలమూరు ఎత్తిపోతల పథకంపై చర్చకు రావాలని మంత్రి జూపల్లి విసిరిన సవాలుపై టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరిన మంత్రి జూపల్లి అన్న మాట ప్రకారం… బాబు హయాంలో కేటాయించిన నిధుల వివరాలతో సోమవారం అసెంబ్లీ హాలుకు వచ్చారు. అక్కడ రెండుగంటలకుపైగా టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కోసం ఎదురుచూసినా ఆయన రాలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరుల సమావేశం పెట్టారు. తాము చర్చకు […]
పాలమూరు ఎత్తిపోతల పథకంపై చర్చకు రావాలని మంత్రి జూపల్లి విసిరిన సవాలుపై టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరిన మంత్రి జూపల్లి అన్న మాట ప్రకారం… బాబు హయాంలో కేటాయించిన నిధుల వివరాలతో సోమవారం అసెంబ్లీ హాలుకు వచ్చారు. అక్కడ రెండుగంటలకుపైగా టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కోసం ఎదురుచూసినా ఆయన రాలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరుల సమావేశం పెట్టారు. తాము చర్చకు భయపడటం లేదని, ఈ చర్చకు స్పీకర్ అనుమతి లేదని దాటవేసే ప్రయత్నం చేశారు. చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామంటూనే.. చర్చకు ఎందుకు తొందర అంటూ తిరిగి జూపల్లినే ప్రశ్నించారు. మరి అలాంటపుడు ఆరోపణలు చేయడమెందుకు, ఆధారాలతో మేమొస్తే.. తోకముడిచి పారిపోవడమెందుకని తెరాస నేతలు టీడీపీని ఎగతాళి చేశారు. చంద్రబాబు పాలమూరుఎత్తిపోతలను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ముమ్మాటికీ ప్రాజెక్టును కట్టి తీరుతామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని, ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి అయితే హైదరాబాద్ కు తాగునీరు వస్తుందని చెప్పారు.