తీయటి పానీయాలపై పన్ను విధించాల్సిందే
స్థూలకాయం సమస్యతో బ్రిటన్‌లో ప్రతి ఏటా 70 వేల మంది మరణిస్తున్నారని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా తీయటి పానీయాలు, ఆహార పదార్ధాలపై 20 శాతం పన్ను విధించాలని బ్రిటన్ డాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ (బిఎంఎ) సభ్యుడు ప్రొఫెసర్ షైలా హోలిన్స్ మాట్లాడుతూ మార్కెట్లో లభిస్తున్న తీయటి ఆహార పదార్ధాలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. వీటిలో […]
BY sarvi13 July 2015 6:37 PM IST
sarvi Updated On: 14 July 2015 6:19 AM IST
స్థూలకాయం సమస్యతో బ్రిటన్‌లో ప్రతి ఏటా 70 వేల మంది మరణిస్తున్నారని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా తీయటి పానీయాలు, ఆహార పదార్ధాలపై 20 శాతం పన్ను విధించాలని బ్రిటన్ డాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ (బిఎంఎ) సభ్యుడు ప్రొఫెసర్ షైలా హోలిన్స్ మాట్లాడుతూ మార్కెట్లో లభిస్తున్న తీయటి ఆహార పదార్ధాలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. వీటిలో చక్కెర కేలరీలు ఎక్కువగా ఉండి, తక్కువ పోషకవిలువలు ఉంటున్నాయి. అందువల్ల చిన్నారులకు సరైన పోషకాహారం లభించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలు చిన్న వయసులోనే స్థూలకాయులుగా మారుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిఏటా స్థూలకాయంతో 70 వేల మంది మరణిస్తున్నారు. నేషనల్ హెల్త్ స్కీంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Next Story