పవన్‌కు క్లారిటీ లేదా?
చేతిలో ఆయుధమున్నపుడు ప్రత్యర్థులపై ప్రయోగించే నేర్పరి తనం ఉండాలి. నేర్పరి తనం ఉన్నా అదును చూసి దాడి చేయాలి. లేకుంటే ప్రయోగించిన ఆయుధాలు తిరిగి మనల్నే బలి తీసుకుంటాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు… ఏపీ, తెలంగాణ నేతలు. రెండు రాష్ర్టాల సమస్యలపై స్పందించే పవన్ ఎవరిని ప్రశ్నించాలో తెలియక తికమకపడుతున్నట్లు ఉంది. ఆయన చేసే విమర్శలపై పట్టుమని 24 గంటలు కూడా నిలబడలేని చంచల మనస్కుడని రాజకీయ […]
BY sarvi14 July 2015 4:35 AM IST
X
sarvi Updated On: 14 July 2015 4:35 AM IST
చేతిలో ఆయుధమున్నపుడు ప్రత్యర్థులపై ప్రయోగించే నేర్పరి తనం ఉండాలి. నేర్పరి తనం ఉన్నా అదును చూసి దాడి చేయాలి. లేకుంటే ప్రయోగించిన ఆయుధాలు తిరిగి మనల్నే బలి తీసుకుంటాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు… ఏపీ, తెలంగాణ నేతలు. రెండు రాష్ర్టాల సమస్యలపై స్పందించే పవన్ ఎవరిని ప్రశ్నించాలో తెలియక తికమకపడుతున్నట్లు ఉంది. ఆయన చేసే విమర్శలపై పట్టుమని 24 గంటలు కూడా నిలబడలేని చంచల మనస్కుడని రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ రోజు చెప్పిన మాటనే రేపు మర్చిపోతాడని రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేసే సంగతి తెలిసిందే! సరిగ్గా ఎన్నికలపుడు నిద్రలేచి ఆతరువాత కానరాకుండా పోతాడన్న అపవాదు ఎలాగూ ఉంది. దీనికితోడు చేసిన విమర్శలపై వెనక్కి తగ్గి రాజకీయ చదరంగంలో చులకన అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రశ్నించడంలోనే లోపం!
ఏపీకి ప్రత్యేకహోదా రాలేదన్న బలమైన ప్రశ్న పవన్ చేతిలో ఉంది. దాన్ని ఎవరిపై ప్రయోగించాలో తెలియకపోవడమే అసలు సమస్యగా మారింది. మొన్న టీడీపీ ఎంపీలపై దాన్ని వదిలితే వారు స్పందించిన తీరుకు పవన్ తలబొప్పి కట్టింది. ఆరునెల్లకోసారి నిద్రలేచే నీకు పార్లమెంటులో మేం చేసేది ఏం తెలుస్తుందని ఘాటుగా విమర్శించడంతో వెనక్కి తగ్గాడు. తను వదిలిన బాణం తనకే తగలడంతో పవన్‌కు దిక్కు తోచలేదు. సరిగ్గా అదేసమయంలో కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదుపై పవన్ స్పందించాడు. జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనంటూ ట్వీట్ చేశాడు. ఏపీ ఎంపీలపై చేసిన విమర్శలు బెడిసికొట్టడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలా ట్వీట్లు చేస్తున్నాడని తెలంగాణవాదులు విమర్శించారు. వెనక్కి వచ్చిన బాణాన్ని ఈసారి కాంగ్రెస్‌పై వదిలాడు. ఈసారి కూడా అది తిరిగి వచ్చి పవన్నే తాకింది. తాము ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని, ఆమేరకు పార్లమెంటులో చేసిన ప్రకటన, మోదీకి సోనియా రాసిన లేఖ విషయాన్ని గుర్తు చేయడంతో పవన్ మరోసారి ఆత్మరక్షణలో పడ్డాడు. తాను వదిలిన ఆయుధాలు తనకే తగలడంతో పవన్ అంతర్మథనంలో పడుతున్నాడని సమాచారం. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నించడం మాని రాష్ట్ర స్థాయి నేతలను ప్రశ్నించే అధికారం పవన్‌కు ఎవరు ఇచ్చారని, ఆయన ఏ హోదాలో ప్రశ్నిస్తున్నారని, ప్రజల కోసం ఆయన ఏం పోరాటాలు చేశారని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మేమేం చేయాలో మాకుతెలుసు! రాజకీయాలపై కనీస అవగాహన లేని వ్యక్తి చెబితే వినాల్సిన దుస్థితిలో లేమని విరుచుకుపడుతున్నారు.
Next Story