Telugu Global
Others

పంచాయ‌తీల్లో నిర‌స‌న హోరు 

పంచాయ‌తీ కార్మికుల నిర‌స‌న‌ల‌తో రాష్ట్రంలోని పంచాయ‌తీ కార్యాల‌యాలు హోరెత్తిపోయాయి. క‌నీస వేత‌నాలు చెల్లించాలి, వేత‌నాల చెల్లింపుకు ప్ర‌భుత్వ‌మే బ‌డ్జెట్ కేటాయించాలి, సిబ్బందిలో అర్హులైన వారిని పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులుగా నియ‌మించాలనే ప‌లు డిమాండ్ల‌తో పంచాయ‌తీ కార్మికులు చేప‌ట్టిన స‌మ్మె 24వ రోజుకు చేరింది. కార్మికులు నిర‌వ‌ధిక స‌మ్మె చేస్తున్నా ప్ర‌భుత్వం క‌నీసం స్పందించ‌డం లేద‌ని ఆరోపిస్తూ కార్మికులు సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయ‌తీ కార్యాల‌యాల‌ను ముట్ట‌డించారు.  నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, దిష్టిబొమ్మ‌ల‌తో జిల్లా మండ‌ల కేంద్రాలు ద‌ద్ద‌రిల్లాయి. పలు చోట్ల […]

పంచాయ‌తీ కార్మికుల నిర‌స‌న‌ల‌తో రాష్ట్రంలోని పంచాయ‌తీ కార్యాల‌యాలు హోరెత్తిపోయాయి. క‌నీస వేత‌నాలు చెల్లించాలి, వేత‌నాల చెల్లింపుకు ప్ర‌భుత్వ‌మే బ‌డ్జెట్ కేటాయించాలి, సిబ్బందిలో అర్హులైన వారిని పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులుగా నియ‌మించాలనే ప‌లు డిమాండ్ల‌తో పంచాయ‌తీ కార్మికులు చేప‌ట్టిన స‌మ్మె 24వ రోజుకు చేరింది. కార్మికులు నిర‌వ‌ధిక స‌మ్మె చేస్తున్నా ప్ర‌భుత్వం క‌నీసం స్పందించ‌డం లేద‌ని ఆరోపిస్తూ కార్మికులు సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయ‌తీ కార్యాల‌యాల‌ను ముట్ట‌డించారు. నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, దిష్టిబొమ్మ‌ల‌తో జిల్లా మండ‌ల కేంద్రాలు ద‌ద్ద‌రిల్లాయి. పలు చోట్ల సీఎం దిష్టిబొమ్మ‌ను దగ్దం చేశారు. 24 రోజులుగా కార్మికులు స‌మ్మె చేస్తున్నా ప్ర‌భుత్వం స్పందించ‌లేద‌న్న బాధ‌తో రంగారెడ్డి జిల్లాలో ఓ కార్మికుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. కార్మికుల‌ స‌మ్మెకు ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జాసంఘాలు, కార్మిక సంఘాలు సంఘీభావం ప్ర‌క‌టించాయి. పంచాయ‌తీ స‌ఫాయిల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క పోతే ప్ర‌భుత్వాన్ని ఊడ్చేసే రోజులు వ‌స్తాయ‌ని సంఘాల నేత‌లు హెచ్చ‌రించారు.
First Published:  13 July 2015 6:38 PM IST
Next Story