పంచాయతీ కార్మికులపై ప్రభుత్వం ప్రతీకార చర్యలు
డిమాండ్ల సాధన కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మెను పరిష్కరించాల్సిన తెలంగాణ ప్రభుత్వం వారిపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ఈనెల ఒకటో తేదీ నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. పధ్నాలుగు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తుండడంతో తెలంగాణలోని గ్రామాల నుంచి మహానగరాల వరకూ అన్నీ చెత్తతో నిండి ఉన్నాయి. స్వచ్ఛ తెలంగాణ అంటూ ప్రచారార్భాటం చేసిన ప్రభుత్వం కార్మికుల సమ్మెపై నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పంచాయతీ కార్మికుల […]
BY sarvi13 July 2015 1:06 PM GMT
sarvi Updated On: 14 July 2015 12:46 AM GMT
డిమాండ్ల సాధన కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మెను పరిష్కరించాల్సిన తెలంగాణ ప్రభుత్వం వారిపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ఈనెల ఒకటో తేదీ నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. పధ్నాలుగు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తుండడంతో తెలంగాణలోని గ్రామాల నుంచి మహానగరాల వరకూ అన్నీ చెత్తతో నిండి ఉన్నాయి. స్వచ్ఛ తెలంగాణ అంటూ ప్రచారార్భాటం చేసిన ప్రభుత్వం కార్మికుల సమ్మెపై నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పంచాయతీ కార్మికుల సమ్మెకు ప్రజలు, ప్రతిపక్షాలతో సహా అన్ని సంఘాలు మద్దతు ప్రకటించారు. గోదావరి పుష్కరాల సమయానికి ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తుందన్న విశ్వాసంతో ఉన్న కార్మికులకు, ప్రభుత్వం పుష్కర విధుల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కాంట్రాక్టు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకోవడం గట్టి షాక్ నిచ్చింది. గోదావరి మహా పుష్కరాల కోసం 1870 మంది కార్మికులతో 16 రోజులకు ప్రభుత్వం కాంట్రాక్టు కుదుర్చుకుంది.ఈ కార్మికులకు రోజుకు రూ.280 వేతనం చెల్లించడంతో పాటు డి.ఎ., బస ఏర్పాటు చేసిందుకు ప్రభుత్వం అంగీకరించింది. వీరిలో 800 మంది కార్మికులు మహారాష్ట్రకు చెందిన వారే. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
Next Story