ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన హైకోర్టు
ఆస్తి కోసం 19 ఏళ్ల యువతి ప్రత్యూషను ఆమె తండ్రి, సవతి తల్లి చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు హైకోర్టు జస్టిస్ దిలీప్ భోసాలే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వెంటనే ప్రత్యూష ఆరోగ్యపరిస్థితి, మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒక యువతికి యాసిడ్ తాగించారంటే .. ఆమెపై సవతి తల్లి ఎంత క్రూరంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. మహిళలపై చులకనభావమే ఇలాంటి […]
BY sarvi14 July 2015 4:42 AM IST
X
sarvi Updated On: 14 July 2015 4:42 AM IST
ఆస్తి కోసం 19 ఏళ్ల యువతి ప్రత్యూషను ఆమె తండ్రి, సవతి తల్లి చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు హైకోర్టు జస్టిస్ దిలీప్ భోసాలే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వెంటనే ప్రత్యూష ఆరోగ్యపరిస్థితి, మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒక యువతికి యాసిడ్ తాగించారంటే .. ఆమెపై సవతి తల్లి ఎంత క్రూరంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. మహిళలపై చులకనభావమే ఇలాంటి ఘటనలకు కారణమని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యూషపై పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం.. స్వయంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సుమోటోగా విచారించాలని అభ్యర్థించారు. దీంతో కోర్టు సుమోటోగా చేపట్టి విచారణ ప్రారంభించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.
Next Story