విమానాల భద్రతను పెంచే గగన్ నావిగేషన్
విమానాలకు భద్రతను పెంచే గగన్ నావిగేషన్ వ్యవస్థను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. గగన్ నావిగేషన్ (జీపీఎస్ – ఎయిడెడ్ జియో అగుమెంటెయడ్ నావిగేషన్) ద్వారా విమాన ప్రయాణాలకు మరింత భద్రతతో పాటు, సర్వీసుల నిర్వహణను మరింత సులువుగా మారనున్నాయి. ఈ జీపీఎస్ సేవలు ఇండియాతో పాటు బంగాళాఖాతం, దక్షిణ, తూర్పు ఆసియాతో పాటు మధ్యప్రాచ్యం వరకు అందుతాయి. అవసరమైతే ఆఫ్రికా వరకు విస్తరించుకోవచ్చు. ఈ వ్యవస్థతో విమాన […]
BY sarvi13 July 2015 6:42 PM IST
sarvi Updated On: 14 July 2015 6:30 AM IST
విమానాలకు భద్రతను పెంచే గగన్ నావిగేషన్ వ్యవస్థను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. గగన్ నావిగేషన్ (జీపీఎస్ – ఎయిడెడ్ జియో అగుమెంటెయడ్ నావిగేషన్) ద్వారా విమాన ప్రయాణాలకు మరింత భద్రతతో పాటు, సర్వీసుల నిర్వహణను మరింత సులువుగా మారనున్నాయి. ఈ జీపీఎస్ సేవలు ఇండియాతో పాటు బంగాళాఖాతం, దక్షిణ, తూర్పు ఆసియాతో పాటు మధ్యప్రాచ్యం వరకు అందుతాయి. అవసరమైతే ఆఫ్రికా వరకు విస్తరించుకోవచ్చు. ఈ వ్యవస్థతో విమాన కదలికల్లో తేడా 3.5 మీటర్ల తేడా తగ్గుతుంది. అంతేకాదు భారతదేశంతో పాటు సార్క్ దేశాల పరిధిలో ప్రయాణించే విమాన కదిలికలు కూడా తెలుసుకోవచ్చు. ఒకేదారిలో విమానాలు ప్రయాణిస్తున్నా తక్కువ దూరంలో వాటిని ఎయిర్ ట్రాఫిక్ అధికారులు మళ్లించగలుగుతారు. దీనివల్ల ఇంధన ఖర్చు భారీగా మిగులుతుంది. అమెరికా, జపాన్, యూరోప్ కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను భారత్‌లో ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రూపొందించాయి. భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం భారత్ రూ.774 కోట్లను వెచ్చించింది. ఈ సేవలు దేశంలోని 50 విమానాశ్రయాల్లో తక్షణమే అందుబాటులోకి వస్తాయి.
Next Story