వికీలీక్స్‌పై పవన్ స్పందిస్తాడా?
2009లో రాజకీయాల్లోకి వస్తూనే అవినీతి నేతల పంచెలు ఊడగొట్టండని పిలుపునిచ్చాడు వపన్. మరునాడు షబ్బీర్ అలీ విమర్శలతో తోకముడిచాడు. 5ఏళ్లపాటు కనుమరుగయ్యాడు. సరిగ్గా 2014 ఎన్నికలకు ముందు జనసేన పేరుతో పార్టీ పెట్టాడు. ప్రశ్నిద్దామంటూ రెండు రాష్ర్టాల ప్రజలకు పిలుపునిచ్చాడు. వెంటనే టీడీపీ పంచన చేరాడు. వరంగల్‌లో నిలబడి కేసీఆర్ బట్టలూడదీసి కొడతా! అని బెదిరించాడు.. తెలంగాణలో టీడీపీని జనాలు ఆదరించలేదు. మొత్తానికి టీడీపీని ఏపీలో గెలిపించడంలో కీలకంగా మారాడు. రాజధాని రైతుల బాధలు నా బాధలని […]
BY Pragnadhar Reddy13 July 2015 1:49 AM IST
X
Pragnadhar Reddy Updated On: 13 July 2015 1:49 AM IST
2009లో రాజకీయాల్లోకి వస్తూనే అవినీతి నేతల పంచెలు ఊడగొట్టండని పిలుపునిచ్చాడు వపన్. మరునాడు షబ్బీర్ అలీ విమర్శలతో తోకముడిచాడు. 5ఏళ్లపాటు కనుమరుగయ్యాడు. సరిగ్గా 2014 ఎన్నికలకు ముందు జనసేన పేరుతో పార్టీ పెట్టాడు. ప్రశ్నిద్దామంటూ రెండు రాష్ర్టాల ప్రజలకు పిలుపునిచ్చాడు. వెంటనే టీడీపీ పంచన చేరాడు. వరంగల్‌లో నిలబడి కేసీఆర్ బట్టలూడదీసి కొడతా! అని బెదిరించాడు.. తెలంగాణలో టీడీపీని జనాలు ఆదరించలేదు. మొత్తానికి టీడీపీని ఏపీలో గెలిపించడంలో కీలకంగా మారాడు. రాజధాని రైతుల బాధలు నా బాధలని ఇటీవల తుళ్లూరు పర్యటనలో ఊకదంపుడు ప్రకటనలు చేశాడు. మరునాడు హైదరాబాద్‌లో స్వరం మార్చాడు. ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్నది కరక్టేనని సమర్థించాడు. పవన్ మాటల్లో నిలకడలేమిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనవి స్వార్థ ప్రయోజనాలని, పెయిడ్ ఆర్టిస్ట్ అని వైస్సార్‌సీపీ విమర్శిస్తోంది. ఆయన అభిమానులు మాత్రం తమ నేత చేస్తున్నది కరక్టేనని వెనకేసుకొస్తున్నారు. ఇకపోతే.. ఆయనపై స్పందించాల్సిన కనీస అవసరం కూడా లేదని పూచికపుల్లలా తీసిపారేస్తోంది టీఆర్ ఎస్. ఓటుకు నోటుకుంభకోణం వెలుగుచూసిన తరువాత అయినా పవన్ స్పందిస్తారనుకున్నాం. ఎట్టకేలకు స్పందించారు. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు పేరు ఎత్తకుండా తప్పంతా కేసీఆర్‌దే అన్నట్లుగా మాట్లాడారు. పైగా చంద్రబాబు చెప్పినట్లు వినకపోతే.. తెలంగాణలో పౌరయుద్ధం వస్తుందని హెచ్చరించాడు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడ్డారు. టీఆర్ ఎస్ అగ్రనేత హరీష్ రావు ఆయనపై జాలిపడ్డాడు. టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ పవన్ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబే ఫోన్ ట్యాపింగ్ కు యత్నించినట్లు సాక్ష్యాధారాలతో వికీలీక్స్ వెల్లడించింది. ఇది కూడా కేసీఆర్ తప్పంటారా? లేక జగన్ తప్పంటారా? ప‌్రశ్నించేవాడు ఈసారి ఎవరిపై పడతారో వేచిచూద్దాం!
Next Story