Telugu Global
Others

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లకై ఉద్యమం: సీపీఎం

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగులకు ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు సాధించడానికి ఐక్య ఉద్యమాలే మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు సాధించడమంటే నయా ఉదారవాద విధానాలపైనా యుద్ధం చేసినట్లేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు కమ్యూనిస్టులు- అంబేద్కరిస్టులు కలిసి పనిచేయాలని అన్నారు. లాల్‌జెండా, ఎర్రజెండా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యం ఇంకా త్వరగా నెరవేరుతుందన్న […]

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగులకు ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు సాధించడానికి ఐక్య ఉద్యమాలే మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు సాధించడమంటే నయా ఉదారవాద విధానాలపైనా యుద్ధం చేసినట్లేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు కమ్యూనిస్టులు- అంబేద్కరిస్టులు కలిసి పనిచేయాలని అన్నారు. లాల్‌జెండా, ఎర్రజెండా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యం ఇంకా త్వరగా నెరవేరుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయన్నారు. కార్పొరేట్‌ శక్తుల గుండెలపై తన్నే ఈ డిమాండ్‌కు అన్ని వర్గాలూ మద్దతు పలుకాలని కోరారు. కులవివక్ష, అంటరానితనం, అణిచివేత, దోపిడి విధానాల నుంచి విముక్తి పొందడానికే ప్రయివేటు రంగంలో సైతం రిజర్వేషన్లు అవసరమన్నారు.
First Published:  12 July 2015 6:37 PM IST
Next Story