Telugu Global
Others

కొత్త యూనివ‌ర్శిటీల‌కు త్వ‌ర‌లో పాల‌క‌మండ‌ళ్లు 

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం త‌ర్వాత ఏర్పాటైన నూత‌న యూనివ‌ర్శిటీకు పాల‌క మండ‌ళ్ల‌ను నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తెలంగాణ‌  ప్ర‌భుత్వం కొత్త‌గా  ప్రొఫెస‌ర్ జ‌య‌శంకర్‌ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాలయం, శ్రీ‌కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఉద్యాన‌వ‌న యూనివ‌ర్శిటీ, పీవీ న‌ర‌సింహారావు ప‌శుసంవ‌ర్ధ‌క యూనివ‌ర్శిటీల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఈ యూనివ‌ర్శిటీల‌కు ఇంత‌వ‌ర‌కూ పాల‌క మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేయ‌లేదు. ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల పాల‌న‌లో అవి న‌డుస్తున్నాయి. అయితే, వీసీలు లేక పోవ‌డంతో టీచింగ్‌, రీసెర్చ్ వ్య‌వ‌హారాలు స‌వ్యంగా సాగ‌డం లేద‌ని విద్యార్ధులు భావిస్తున్నారు. […]

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం త‌ర్వాత ఏర్పాటైన నూత‌న యూనివ‌ర్శిటీకు పాల‌క మండ‌ళ్ల‌ను నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తెలంగాణ‌ ప్ర‌భుత్వం కొత్త‌గా ప్రొఫెస‌ర్ జ‌య‌శంకర్‌ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాలయం, శ్రీ‌కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఉద్యాన‌వ‌న యూనివ‌ర్శిటీ, పీవీ న‌ర‌సింహారావు ప‌శుసంవ‌ర్ధ‌క యూనివ‌ర్శిటీల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఈ యూనివ‌ర్శిటీల‌కు ఇంత‌వ‌ర‌కూ పాల‌క మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేయ‌లేదు. ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల పాల‌న‌లో అవి న‌డుస్తున్నాయి. అయితే, వీసీలు లేక పోవ‌డంతో టీచింగ్‌, రీసెర్చ్ వ్య‌వ‌హారాలు స‌వ్యంగా సాగ‌డం లేద‌ని విద్యార్ధులు భావిస్తున్నారు. విద్యార్ధుల్లో నెల‌కొన్న ఈ భ‌యాందోళ‌న‌ల‌ను పోగొట్టేందుకు మూడు యూనివ‌ర్శిటీల‌కు వీసీల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆమేర‌కు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్త‌యింద‌ని స‌మాచారం. వీసీల నియామ‌కంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటార‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి పోచారం శ్రీనివాస‌రెడ్డి చెప్పారు.
First Published:  12 July 2015 6:47 PM IST
Next Story