ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జలమండలి జీతాలు
జలమండలి ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని టీ. సర్కార్ నిర్ణయించింది. జలమండలి ఉద్యోగులకు కూడా పదో పీఆర్సీ సిఫారుసులను అమలు చేయాలని ఆ శాఖ ఉద్యోగులు వారం రోజులపాటు నిరవధిక సమ్మె కొనసాగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగులు, కార్మికులు సమ్మె విరమించడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సమాన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిందని, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమ్మె విరమించండి : కమిషనర్ ఎస్ఎంఎస్ […]
BY sarvi12 July 2015 6:48 PM IST
sarvi Updated On: 13 July 2015 6:18 AM IST
జలమండలి ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని టీ. సర్కార్ నిర్ణయించింది. జలమండలి ఉద్యోగులకు కూడా పదో పీఆర్సీ సిఫారుసులను అమలు చేయాలని ఆ శాఖ ఉద్యోగులు వారం రోజులపాటు నిరవధిక సమ్మె కొనసాగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగులు, కార్మికులు సమ్మె విరమించడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సమాన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిందని, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సమ్మె విరమించండి : కమిషనర్ ఎస్ఎంఎస్
జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించి విధుల్లోకి చేరాలని కోరుతూ కమిషనర్ సోమేష్‌కుమార్ కార్మికుల సెల్‌ఫోన్లకు మెసేజ్ పంపారు. ప్రియమైన కార్మికులారా, మీ సమస్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. మీ డిమాండ్లు తప్పకుండా నెరవేరతాయి. మీరు వెంటనే విధుల్లో చేరండి. రంజాన్ పండుగ నేపథ్యంలో మీరంతా విధుల్లో చేరాలని కోరుతున్నానని కమిషనర్ కార్మికులకు మెసేజ్ పంపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జలమండలి ఉద్యోగులు సమ్మెను విరమించగానే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం అదేవిధంగా స్పందిస్తుందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
Next Story