మత్తయ్య, జిమ్మి కోసం ఏసీబీ గాలింపు తీవ్రం
ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న జెరుసలేం మత్తయ్య, జిమ్మి బాబుల కోసం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గాలింపు తీవ్రతరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలతో పాటు సెబాస్టియన్, ఉదయసింహలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహలు బెయిల్‌పై విడుదల కాగా సండ్ర వీరయ్య రిమాండ్‌లో ఉన్నారు. ఈ ఐదుగురి కస్టడీ విచారణ సందర్భంగా మత్తయ్య, జిమ్మి బాబులది కూడా […]
BY Pragnadhar Reddy12 July 2015 9:59 PM
X
Pragnadhar Reddy Updated On: 12 July 2015 9:59 PM
ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న జెరుసలేం మత్తయ్య, జిమ్మి బాబుల కోసం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గాలింపు తీవ్రతరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలతో పాటు సెబాస్టియన్, ఉదయసింహలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహలు బెయిల్‌పై విడుదల కాగా సండ్ర వీరయ్య రిమాండ్‌లో ఉన్నారు. ఈ ఐదుగురి కస్టడీ విచారణ సందర్భంగా మత్తయ్య, జిమ్మి బాబులది కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర ఉన్నట్లు అధికారులకు ఆధారాలు దొరికాయి. మత్తయ్యపై నాలుగో నిందితుడిగా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన ఎసిబికి చిక్కలేదు. విజయవాడలో తలదాచుకొని అక్కడి పోలీసు స్టేషన్‌లో ఇక్కడి అధికారులపై కేసులు పెట్టారు. ఆయన బాటలోనే జిమ్మిబాబు కూడా ఎపిలో తలదాచుకున్నట్లు ఎసిబి అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఇరువురి బంధువులు, స్నేహితుల సమాచారం మేరకు విజయవాడలో అక్కడి పోలీసుల సంరక్షణలోనే ఉన్నట్లు తేలడంతో అక్కడికి వెళ్ళేందుకు ఎసిబి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో ఎపి సిఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఇతరులకు నోటీసులు జారీ చేసేందుకు ఎసిబి సమాయత్తమవుతోంది.
Next Story