Telugu Global
Others

ఆగస్టు 3న ఏసీబీ కోర్టుకు మళ్ళీ రేవంత్‌ 

వచ్చేనెల 3న హాజరు కావాల్సిందిగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ బెయిల్‌ పిటీషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. కాగా రేవంత్‌రెడ్డి కోర్టుకు గైర్హాజరవడంతో ఆగష్టు 3న స్వయంగా హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఆర్డర్‌లో హైదరాబాద్‌కు రావద్దని ఆదేశాలు ఉండటం వల్లే ఆయన రాలేదని రేవంత్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. బెయిల్‌పై ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఏసీబీ కోర్టుకు హాజరుకావాల్సిందే […]

ఆగస్టు 3న ఏసీబీ కోర్టుకు మళ్ళీ రేవంత్‌ 
X
వచ్చేనెల 3న హాజరు కావాల్సిందిగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ బెయిల్‌ పిటీషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. కాగా రేవంత్‌రెడ్డి కోర్టుకు గైర్హాజరవడంతో ఆగష్టు 3న స్వయంగా హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఆర్డర్‌లో హైదరాబాద్‌కు రావద్దని ఆదేశాలు ఉండటం వల్లే ఆయన రాలేదని రేవంత్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. బెయిల్‌పై ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఏసీబీ కోర్టుకు హాజరుకావాల్సిందే అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇదే కేసుకు సంబంధించి రేవంత్‌ సహ నిందితులు సెబాస్టియన్‌, ఉదయసింహలు కోర్టుకు హాజరయ్యారు. చార్జిషీటు వేసిన తర్వాతే కోర్టుకు రావాలని అప్పటివరకు మినహాయింపు ఉంటుందని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆగష్టు 3న రేవంత్‌రెడ్డి కోర్టుకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు చెప్పడంతో విచారణను వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసులో సండ్ర వెంకటవీరయ్య బెయిల్‌ పిటిషన్‌పైనా కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే వాదనలు పూర్తి అయిన నేపథ్యంలో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది.
First Published:  13 July 2015 6:26 AM IST
Next Story