సైకిల్ దిగాల్సిందే .... టీ. బీజేపీ నేతల అంతర్మథనం
సైకిల్ ఎక్కి జై కొట్టలేరు… సైకిల్ దిగి కింద నిలబడనూ లేరు…. ఇదీ తెలంగాణ బీజేపీ నేతల పపరిస్థితి. 2014 సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని విజయం సాధించింది. ఈ పొత్తు పుణ్యమా అని ఆంధ్రాలో బీజేపీ నేతలు ఎంచక్కా మంత్రి పదవులు అనుభవిస్తూ హాయిగా ఉంటే, తెలంగాణ నేతలు మాత్రం సైకిల్ దెబ్బకు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యామని, వెంటనే సైకిల్ దిగాల్సిందేనని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో […]
BY admin11 July 2015 6:55 PM IST
admin Updated On: 12 July 2015 3:26 PM IST
సైకిల్ ఎక్కి జై కొట్టలేరు… సైకిల్ దిగి కింద నిలబడనూ లేరు…. ఇదీ తెలంగాణ బీజేపీ నేతల పపరిస్థితి. 2014 సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని విజయం సాధించింది. ఈ పొత్తు పుణ్యమా అని ఆంధ్రాలో బీజేపీ నేతలు ఎంచక్కా మంత్రి పదవులు అనుభవిస్తూ హాయిగా ఉంటే, తెలంగాణ నేతలు మాత్రం సైకిల్ దెబ్బకు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యామని, వెంటనే సైకిల్ దిగాల్సిందేనని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన ఆడియోటేపులు బైటకు రావడంతో వీరు తెగ ఇబ్బంది పడుతున్నారు. టీవీ చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో బాబు గారిని, రేవంత్ రెడ్డిని గట్టిగా సమర్థించలేక, బహిరంగంగా విమర్శించలేక ఎటూగాకుండా పోతున్నారు. దీంతో, తెలంగాణలో బీజేపీ ఎదగాలంటే నెత్తి మీద మోస్తున్న సైకిల్‌ను కిందకు దించాల్సిందేనని పార్టీ హైకమాండ్ వద్ద వాపోతున్నారట. మరి అధిష్టానం వీరితో బలవంతంగా సైకిల్‌ను మోపిస్తుందా? లేదా సైకిల్‌తో బంధాలు తెంచుకుంటుందో వేచి చూడాల్సిందే.
Next Story