Telugu Global
Others

నిపుణత సాధిస్తే విశ్వగురువు భారతే: వెంకయ్య

భారతదేశ జనాభాలో 65 శాతం ఉన్న యువతకు అన్ని విధాలుగా నైపుణ్యాలు నేర్పిస్తే ప్రపంచంలోని అన్ని దేశాలను శాసించే స్థాయికి చేరతామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. తద్వారా విజ్ఞానంలో మన దేశం విశ్వ గురువుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో ముప్పవరపు ఫౌండేషన్‌, అతుల్‌ నిషార్‌ ఫౌండేషన్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రైతు, యువత శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ […]

భారతదేశ జనాభాలో 65 శాతం ఉన్న యువతకు అన్ని విధాలుగా నైపుణ్యాలు నేర్పిస్తే ప్రపంచంలోని అన్ని దేశాలను శాసించే స్థాయికి చేరతామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. తద్వారా విజ్ఞానంలో మన దేశం విశ్వ గురువుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో ముప్పవరపు ఫౌండేషన్‌, అతుల్‌ నిషార్‌ ఫౌండేషన్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రైతు, యువత శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ సాంకేతిక ప్రగతి యువతతోనే సాధ్యమవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి మన మంత్రం కావాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ శాఖ ద్వారా దేశంలో 630 జిల్లా కేంద్రాల్లో, ఏపీలో 170 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించిందని తెలిపారు.

First Published:  11 July 2015 6:35 PM IST
Next Story