పోలీసు వ్యూహం బెడిసి రేప్ మీద రేప్!
బాలికపై లైంగికదాడి జరిగితే.. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఆమెనే ఎరగా వేయడంతో బాధితురాలు మరోసారి లైంగికదాడికి గురైన సంఘటన మహారాష్ట్రలోని జాల్నాలో చోటు చేసుకుంది. 17 ఏండ్ల ఓ బాలిక ఈ నెల 7న నావా రోడ్‌పై తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్తుండగా ఇద్దరు యువకులు వారిని కత్తితో బెదిరించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. బాయ్‌ఫ్రెండ్‌ను బంధించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కుని సంఘటనను వీడియో తీశారు. ఆ తరువాత ఇంటికి చేరిన […]
BY Pragnadhar Reddy11 July 2015 6:38 PM IST
Pragnadhar Reddy Updated On: 12 July 2015 1:16 PM IST
బాలికపై లైంగికదాడి జరిగితే.. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఆమెనే ఎరగా వేయడంతో బాధితురాలు మరోసారి లైంగికదాడికి గురైన సంఘటన మహారాష్ట్రలోని జాల్నాలో చోటు చేసుకుంది. 17 ఏండ్ల ఓ బాలిక ఈ నెల 7న నావా రోడ్‌పై తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్తుండగా ఇద్దరు యువకులు వారిని కత్తితో బెదిరించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. బాయ్‌ఫ్రెండ్‌ను బంధించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కుని సంఘటనను వీడియో తీశారు. ఆ తరువాత ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పింది. ఈ నేపథ్యంలోనే దుండగులు ఆమె తల్లికి ఫోన్ చేసి రూ.2 వేలు ఇస్తేనే ఫోన్‌ను తిరిగి ఇస్తామని బ్లాక్‌మెయిల్‌కు దిగారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దుండగులను వారిని పట్టుకునేందుకు ఓ వ్యూహం రచించారు. బాలికనే వారు చెప్పిన చోటికి వెళ్లాలని చెప్పి పోలీసులు మాటు వేశారు. బాలిక ఆ ప్రదేశానికి చేరే లోపే దుండగులు మార్గమధ్యంలోనే ఆమెను అటకాయించి మరోసారి అత్యాచారానికి ఒడిగట్టారు. మొత్తంమీద వారిని పోలీసులు అరెస్టు చేసినా ఈ చెత్త వ్యూహానికి కారణమైన ఏఎస్ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Next Story