Telugu Global
Others

అయోమ‌యంలో డొక్కా

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజ‌కీయ భ‌విత‌వ్యం అయోమ‌యంగా మారింది. ఒక‌వైపు త‌న రాజ‌కీయ గురువు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మ‌రోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఆహ్వానాలు ఆయ‌న‌ను ఆయోమ‌యంలోకి నెట్టేశాయి. మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్ల‌కుండా రాయ‌పాటి అడ్డుకున్నార‌ని వినిపిస్తోంది. మ‌రోవైపు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్ల‌డం లేద‌ని మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ మీడియాకు చెప్పారు. ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావుతో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లా‌డారు. వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు రావడంతో అంగీకరించానని.. అయితే […]

అయోమ‌యంలో డొక్కా
X
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజ‌కీయ భ‌విత‌వ్యం అయోమ‌యంగా మారింది. ఒక‌వైపు త‌న రాజ‌కీయ గురువు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మ‌రోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఆహ్వానాలు ఆయ‌న‌ను ఆయోమ‌యంలోకి నెట్టేశాయి. మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్ల‌కుండా రాయ‌పాటి అడ్డుకున్నార‌ని వినిపిస్తోంది. మ‌రోవైపు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్ల‌డం లేద‌ని మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ మీడియాకు చెప్పారు. ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావుతో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లా‌డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు రావడంతో అంగీకరించానని.. అయితే ప్రస్తుతం నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు. తాను రాజకీయాల్లో పదకొండేళ్ల బాలుడినేని, ఇంకా ఎంతో అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రస్తుతం నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలకు తాను పనికి రాననిపిస్తోందని వేదాంత ధోరణిలో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు అంతా అయోమయంగా ఉందని, తాను ఇక రాజకీయాల్లో ఉండకపోవచ్చేమోనని అన్నారు. తనకు రాజకీయాలకంటే ఎంపీ రాయపాటి సాంబశివరావే ముఖ్యమని చెప్పారు.
First Published:  12 July 2015 6:37 AM IST
Next Story