సల్మాన్ సినిమా సెన్సార్ పూర్తి
సల్మాన్ ఖాన్ తాజా చిత్రం భజరంగీ భాయ్ జాన్. ఈ సినిమా సెన్సార్ తాజాగా పూర్తయింది. కాస్త కాంట్రవర్సీ సబ్జెక్ట్ గా కనిపిస్తున్న భజరంగీ భాయ్ జాన్ సినిమాపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. అక్కడక్కడ ఆందోళనలు కూడా చెలరేగాయి. అయినప్పటికీ సెన్సార్ బోర్డు వాటిని పట్టించుకోలేదు. సినిమా బాగుందని మెచ్చుకుంటూనే U/A సర్టిఫికేట్ ఇచ్చింది. కబీర్ ఖాన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను వచ్చే శుక్రవారం విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పాకిస్తాన్ నుంచి తప్పిపోయి […]
BY admin12 July 2015 1:40 AM IST
X
admin Updated On: 12 July 2015 6:35 AM IST
సల్మాన్ ఖాన్ తాజా చిత్రం భజరంగీ భాయ్ జాన్. ఈ సినిమా సెన్సార్ తాజాగా పూర్తయింది. కాస్త కాంట్రవర్సీ సబ్జెక్ట్ గా కనిపిస్తున్న భజరంగీ భాయ్ జాన్ సినిమాపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. అక్కడక్కడ ఆందోళనలు కూడా చెలరేగాయి. అయినప్పటికీ సెన్సార్ బోర్డు వాటిని పట్టించుకోలేదు. సినిమా బాగుందని మెచ్చుకుంటూనే U/A సర్టిఫికేట్ ఇచ్చింది. కబీర్ ఖాన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను వచ్చే శుక్రవారం విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పాకిస్తాన్ నుంచి తప్పిపోయి ఇండియాలో చిక్కుకుపోయిన ఓ ముస్లిం చిన్నారి, హీరో తిరిగి పాకిస్తాన్ లోకి చిన్నారి తల్లిదండ్రులకు ఎలా అందిస్తాడనేది స్టోరీలైన్. కాస్త కమర్షియల్ హంగులకు దూరంగా సినిమాను తెరకెక్కించినప్పటికీ.. కరీన్ కపూర్ తో పిక్చరైజ్ చేసిన ఐటెంసాంగ్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ముందు షారూక్, అమీర్ ఖాన్ లకు చూపించాలని ఫిక్స్ అయ్యాడు సల్మాన్.
Next Story