ఇంటర్నెట్ హబ్‌గా అగర్తలాకు ప్రాధాన్యం
త్రిపురలోని అగర్తలాను ముంబై, చెన్నై నగరాలకు ధీటైన ఇంటర్నెట్ నగరంగా మారుస్తామని, ఇంటర్నేషనల్ ఇంటర్‌నెట్ గేట్‌వేగా మారుస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. ఆయన శనివారం అగర్తలాలో ఇంటర్‌నెట్ సంబంధిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికే అగర్తలాను కేంద్రంగా ఎంపిక చేశామని ఆయన అన్నారు.ఈ రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ కేబుల్ సంస్థ నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తామని, బీఎస్ఎన్ఎల్ -బంగ్లాదేశ్ సబ్‌మెరైన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్ ప్రాజెక్టు […]
త్రిపురలోని అగర్తలాను ముంబై, చెన్నై నగరాలకు ధీటైన ఇంటర్నెట్ నగరంగా మారుస్తామని, ఇంటర్నేషనల్ ఇంటర్‌నెట్ గేట్‌వేగా మారుస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. ఆయన శనివారం అగర్తలాలో ఇంటర్‌నెట్ సంబంధిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికే అగర్తలాను కేంద్రంగా ఎంపిక చేశామని ఆయన అన్నారు.ఈ రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ కేబుల్ సంస్థ నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తామని, బీఎస్ఎన్ఎల్ -బంగ్లాదేశ్ సబ్‌మెరైన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్ ప్రాజెక్టు 2016 నాటికి పూర్తవుతుందని ఆయన అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే, తక్కువ ఖర్చుతోనే ఇంటర్నెట్ లభిస్తుందని, ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.19.1 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని, ఏడాదికి రూ. 7.2 కోట్లు నిర్వహణ వ్యయమవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పాల్గొన్నారు.