Telugu Global
Others

యూపీఏ సర్కార్‌పై ట్యాపింగ్‌ బాంబ్ పేల్చిన వికీలీక్స్‌

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఫోన్ ట్యాపింగ్‌, గూఢచర్యానికి పాల్పడిందనే బాంబ్‌ లాంటి కథనాన్ని వికీలీక్స్‌ సంస్థ ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు, కంప్యూటర్ల వంటి సాధనాలపై గూఢచర్యం నిర్వహించడానికి అనువైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన వివాదాస్పద ఇటలీ సంస్థ గిజ్మోడాతో యూపీఏ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని వికీలీక్స్‌ తన తాజా కథనంలో పేర్కొంది. కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, భారత దర్యాప్తు సంస్థలు గిజ్మోడాకు ముఖ్యమైన క్లయింట్లనే విషయాన్ని ఆ సంస్థ ఈ-మెయిల్‌ను హ్యాకింగ్‌ చేయడంతో […]

యూపీఏ సర్కార్‌పై ట్యాపింగ్‌ బాంబ్ పేల్చిన వికీలీక్స్‌
X
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఫోన్ ట్యాపింగ్‌, గూఢచర్యానికి పాల్పడిందనే బాంబ్‌ లాంటి కథనాన్ని వికీలీక్స్‌ సంస్థ ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు, కంప్యూటర్ల వంటి సాధనాలపై గూఢచర్యం నిర్వహించడానికి అనువైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన వివాదాస్పద ఇటలీ సంస్థ గిజ్మోడాతో యూపీఏ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని వికీలీక్స్‌ తన తాజా కథనంలో పేర్కొంది. కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, భారత దర్యాప్తు సంస్థలు గిజ్మోడాకు ముఖ్యమైన క్లయింట్లనే విషయాన్ని ఆ సంస్థ ఈ-మెయిల్‌ను హ్యాకింగ్‌ చేయడంతో తెలిసిందని వికీలీక్స్‌ పేర్కొంది. ఈమెయిల్లో వెల్లడైన వివరాల ప్రకారం హ్యాకింగ్ బృంద సభ్యులు ఇటీవల భారత్‌లో పర్యటించి ఫోన్లను ట్యాప్‌ చేయడానికి ఉపయోగించే హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ అంశాలపై డెమో నిర్వహించారు. భారత్‌తో ఈ ఒప్పందం జరుపుకోవడానికి ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఐసీఈ (నైస్)తో గిజ్మోడా భాగస్వామ్య ఒప్పందం చేసుకుందని ఆ కథనంలో పేర్కొంది. గిజ్మోడాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2011 ఆగస్టులో నైస్‌ ప్రతినిధులు కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శితో చర్చలు జరిపారనే విషయంలో ఈమెయిల్ ద్వారా వెల్లడైందని వికీలీక్స్‌ ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో గిజ్మోడాను సంప్రదించిందనే అంశంపై తమకు ఆధారాలు లభించలేదని, రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పని చేసే వీ6 స్పైవేర్‌ గురించి వివరించాలని హ్యాకింగ్‌ బృందం ప్రతినిధులను ఇటలీలోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు కోరినట్లు వికీలీక్స్‌ పేర్కొంది.
First Published:  11 July 2015 7:37 AM IST
Next Story