ఏసీబీకి చుక్కలు చూపించిన సండ్ర!
ఓటుకు నోటు కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీకి చుక్కలు చూపించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాలతో విచారించేందుకు ఏసీబీ సండ్రను తన కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే! ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ను కొనుగోలు చేయడానికి డబ్బు ఎవరు ఇచ్చారు? ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? సార్ అంటే ఎవరు? అని ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే విచారణకు మానసికంగా ముందుగానే సిద్ధమైన సండ్ర ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించారు. నోరు […]
BY Pragnadhar Reddy10 July 2015 7:33 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 10 July 2015 10:37 PM GMT
ఓటుకు నోటు కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీకి చుక్కలు చూపించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాలతో విచారించేందుకు ఏసీబీ సండ్రను తన కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే! ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ను కొనుగోలు చేయడానికి డబ్బు ఎవరు ఇచ్చారు? ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? సార్ అంటే ఎవరు? అని ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే విచారణకు మానసికంగా ముందుగానే సిద్ధమైన సండ్ర ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించారు. నోరు తెరిచి ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. దీంతో ఏసీబీ అధికారులు తలలు పట్టుకోవడం మినహా రెండు రోజుల విచారణలో ఒక్క కొత్త విషయాన్ని వెలికి తీయలేకపోయారు. సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యే కావడం వల్ల ఏసీబీ విచారణ సమయంలో కొన్ని పరిమితులు పాటించాల్సి వచ్చింది. న్యాయవాది సమక్షంలో విచారించాల్సి రావడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని కోర్టు ఆదేశాలివ్వడంతో పోలీసులు ప్రశ్నలకు పరిమితమవ్వాల్సి వచ్చింది. దీన్ని ఆసరంగా చేసుకుని సండ్ర ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఎదరుగా సెబాస్టియన్‌ను కూర్చోబెట్టి ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ప్చ్! పాపం ఏసీబీ అధికారులు! కోర్టు ఇచ్చిన రెండురోజుల గడువు ముగియడంతో చేసేదిలేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.
Next Story